Curfew in AP: ఏపీలో కర్ఫ్యూ వేళలు సడలించిన సీఎం YS Jagan, ఆ జిల్లాలో మాత్రం యథాతథం
Curfew Relaxation In AP: కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏపీలో కర్ఫ్యూ వేళలు మరోసారి పొడిగించారు. ఆ జిల్లాలో మాత్రం యథాతథంగా కొనసాగుతుంది.
Curfew in AP: కరోనా మహమ్మారి కట్టడికి విధించిన ఏపీ కర్ఫ్యూ సత్ఫాలితాలనిచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ వేళల్లో సడలింపులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 వరకు ఉన్న సడలింపులను సాయంత్రానికి పెంచుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు అమల్లో ఉండనున్నాయి. కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆస్పత్రులలో కోవిడ్19 బాధితులకు అందుతున్న వైద్య సేవలు, కోవిడ్ వ్యాక్సినేషన్, 104 కాల్‌సెంటర్, రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు వంటి తరదితర అంశాలపై AP CM YS Jagan Mohan Reddy ఉన్నతాధికారులతో చర్చించారు. సడలింపు వేళలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పొడిగించగా, జూన్ 21 నుంచి 30 వరకు ఈ కర్ఫ్యూ సడలింపు అమలులో ఉంటుందని తెలిపారు.
Also Read: AP Jobs Calendar: ఏపీ జాబ్స్ క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
కాగా, రాష్ట్రంలో దుకాణాలు సాయంత్రం 5 గంటలకే మూసివేయాలని సూచించారు. ఇళ్లకు చేరుకోవడానికి మరో గంట సమయం అదనంగా కేటాయిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ (AP Covid-19 Cases) కరోనా తీవ్రత అధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం సడలింపులు యథాతథంగా ఉంచారు. ఇప్పటివరకూ అమల్లో ఉన్నట్లుగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఇక్కడే సడలింపులు అమలులో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు యథాతథంగా విధులకు హాజరుకావాలని సమీక్షా సమావేశంలో ఏపీ సీఎం సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook