ఏపీ డీఎస్సీ 2018 సిలబస్ ప్రకటన
డీఎస్సీ 2018 సిలబస్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెబ్‌సైట్లో విడుదల చేసింది.
డీఎస్సీ 2018 సిలబస్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెబ్‌సైట్లో విడుదల చేసింది. ఇందులో స్కూలు అసిస్టెంటు పోస్టులతో పాటు లాంగ్వేజ్ పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్లకు కూడా ప్రత్యేకంగా సిలబస్ వివరాలను తెలియజేయడం జరిగింది.
స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ, తమిళం, ఒరియా, కన్నడ, సంస్కృతం, గణితం, భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం, సామాజిక శాస్త్రం) సిలబస్‌తో పాటు లాంగ్వేజ్ పండిట్ (తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడం, తమిళం, ఒరియా, సంస్కృతం) సిలబస్ కూడా వెబ్ సైట్లో అధికారులు పొందుపరిచారు.
స్కూలు అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, ఎస్టీటీ ప్రశ్నలు, మార్కుల వివరాలు:
జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్ - 10 మార్కులు
పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ - 5 మార్కులు
క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ - 5 మార్కులు
కంటెంట్ - 44 మార్కులు
మెథడాలజీ - 16 మార్కులు
మొత్తం - 80 మార్కులు
ఎస్జీటీల విషయంలో కంటెంట్, మెథడాలజీలు కలిపి 60 మార్కులు (45+15)గా నిర్దేశించడం జరిగింది.
డీఎస్సీ సిలబస్ పూర్తిగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి: https://aptet.apcfss.in/jsp/DscSyllabus18.jsp