Singanamala Assembly Constituency: ఏపీ ఎన్నికల సమీకొస్తున్న కొద్దీ రాజకీయ సమీకణాలు వేగంగా మారుతున్నాయి. అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. గెలుపు తమదంటే తమదంటూ లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయాలు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ-కూటమి అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇక శింగనమల నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ బలమైన పోటీనిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, APPCC మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ బరిలో ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ వైభవం కోల్పోయినా.. ఆయన ఇతర పార్టీల్లోకి వెళ్లలేదు. వైసీపీ, టీడీపీ నుంచి ఆహ్వానాలు అందినా.. కాంగ్రెస్‌లోనే కొనసాగారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Rain Alert: ఎండల్నించి ఉపశమనం, ఇవాళ, ఎల్లుండి రాష్ట్రంలో వర్షసూచన


శింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానం కాగా.. 2004, 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి శైలజానాథ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్‌ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. తనకు సెంటిమెంట్‌గా మారిన శింగనమల నుంచి ఆయన మరోసారి పోటీ చేస్తున్నారు. అధికార వైఎస్సార్సీపీ నుంచి వీరాంజనేయులు పోటీలో ఉండగా.. టీడీపీ నుంచి బండారు శ్రావణిశ్రీ బరిలో ఉన్నారు. వీరిద్దరి నుంచి శైలజానాథ్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరులో గెలుపు ఎవరిదని ఆసక్తికరంగా మారింది.


టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణికి కూటమి నేతల నుంచి సహకారం లభించకపోవడం మైనస్ అని విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ సీనియర్ నాయకులపైనే ఆమె కేసులు పెట్టడంతో సహకారం లభించడం కష్టమని చెబుతున్నారు. శైలజానాథ్ పోటీతో ఆమెకు గెలుపు మరింత కష్టంగా మారింది. ఆయనకు ఇతర పార్టీల నాయకుల సహకారం కూడా ఉండడంతో ప్లస్‌గా మారుతుందని అంటున్నారు. టీడీపీలోని ఒక వర్గం శైలజానాథ్‌కు సపోర్ట్ చేస్తామంటూ చెప్పడం విశేషం. 


వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వీరాంజనేయులు గతంలో టిప్పర్ డ్రైవర్‌గా పనిచేశారు.  సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో ఆయనను పోటీలో నెలబెట్టారు. ఆయన గెలిచినా ఇక్కడ పద్మావతి భర్త సాంబశివారెడ్డిదే హవా ఉంటుందని అంటున్నారు. దీంతో సొంతపార్టీల నేతల నుంచి సహకారం తక్కువైనట్లు తెలుస్తోంది. త్రిముఖ పోరులో శింగనమల ప్రజలు ఎవరిని గెలిపిస్తారో జూన్ 4న తేలిపోతుంది.


Also Read: Hamida banu: భారత్ తొలి రెజ్లర్ .. గూగుల్ డూడుల్ హమీదా భాను గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter