AP Elections Counting: దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు ఎలక్షన్ కమిషన్ 7వ విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది. రేపు (జూన్ 1) దేశ వ్యాప్తంగా మిగిలిన 57 లోక్ సభ స్థానాలకు జరిగే పోలింగ్‌తో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది. ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్ లోక సభ స్థానంతో పాటు అరుణాల్ ప్రదేశ్‌లో 8 అసెంబ్లీ సీట్లను కూడా బీజేపీ ఏక గ్రీవంగా కైవసం చేసుకుంది. ఇక ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ సీట్లకు కూడా ఎన్నికలు జరిగాయి. ఇక ఏపీలో 4వ విడతో 25 లోక్ సభ సీట్లతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందో అని అధికార వైయస్‌ఆర్సీపీతో పాటు భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టిన తెలుగు దేశం, జనసేన కూటమి నేతలు నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరో మూడు రోజులు తర్వాత ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఎవరికీ పట్టం కట్టారనే విషయం స్పష్టతకు వస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూన్ 4 జరిగినే కౌంటింగ్‌లో భాగంగా.. ముందుగా సైనిక దళాల్లో పనిచేసే వారి ఓట్టు.. ఈటీబీపీఎస్ (ETBPS) ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా పోలైనవి లెక్కిస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు.


ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్.. 11 గంటల వరకు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే ట్రెండ్ మొదలవుతోంది. మధ్యాహ్నం రెండు గంటల వరకు తుది ఫలితాలపై క్లారిటీ రానుంది. మొత్తంగా 175 స్థానాల్లో 111 అసెంబ్లీ సీట్ల ఫలితాలపై మధ్యాహ్నం వరకు ఫలితాలు రానున్నాయి. ఇక 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు క్లారిటీ రానుంది. ఇక ఏపీలో తొలి ఫలితం ఒకప్పటి ఉభయ గోదావరి జిల్లాలోని నరసాపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో అతి తక్కువగా 13 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. దీంతో మొదటి ఫలితం ఆ నియోజకవర్గం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


ఇక విశాక పట్నంలోని భీమిలి, కర్నూలు జిల్లాలోని పాణ్యం ఫలితాల కోసం సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ఎన్నికల్లో ఏపీ ముఖ్య మంత్రి .. వైయస్‌ఆర్సీపీ అభ్యర్ధిగా పులివెందుల నుంచి మూడోసారి బరిలో నిలిచారు. అటు చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి.. జనసేన అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీలో ఉన్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసారు. అటు బాలయ్య.. హిందూపురం, లోకేష్.. మంగళగిరి నుంచి గెలుస్తారా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది.


కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. సమస్యాత్యక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించనున్నారు. ఇక ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతులు లేవని ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


Read more: Cop cpr on monkey: హ్యాట్సాఫ్ సార్.. సీపీఆర్ చేసి కోతిని కాపాడిన పోలీసు.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter