AP Elections Counting: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకు 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించింది ఎన్నికల కమిషనర్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో 97 కోట్ల మంది ఓటర్లకు గాను 64.2 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరికొన్ని గంటల్లో దేశ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనే విషయం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో 25 లోక్ సభ సీట్లతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రజలు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తపరిచారు. ఇక రేపు జరగబోయే కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఏపీ  ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇప్పటికే కొన్ని కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లి కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించన వివషయాన్ని మీడియాకు వెల్లడించారు.  జూన్ 4 ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపు ఉంటుందని తెలిపారు. తొలి అరగంట తర్వాత ఈవీఎంలో పోలైన ఓట్లను లెక్కిస్తారని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీ ఎత్తున వచ్చినట్టు ఈసీ తెలిపారు. వాటికి సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు గాను  119 మంది అబ్జర్వ్వర్లను నియమించినట్టు తెలిపారు. అంతేకాదు ఏపీలో కొవ్వూరు, నరసాపురం ఫలితాలు తొలి ఐదు గంటల్లో వెల్లడికానున్నట్టు మీడియాకు  తెలిపారు. నరసాపురం పార్లమెంట్ స్థానానికి 13 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ పూర్తి కానున్నట్టు తెలిపారు. మరోవైపు అమలాపురం పార్లమెంట్ స్థానంలో 27 రౌండ్ల లెక్కింపు తర్వాత ఫలితం వెల్లడి కానుంది. ఈ ప్రక్రియకు దాదాపు 9 గంటల సమయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇక భీమిలి, పాణ్యం అసెంబ్లీ స్థానాలకు 26 రౌండ్లలో పోలింగ్ పూర్తి కానుంది. కౌంటింగ్ మొత్తాన్ని మీడియా చిత్రీకరించుకోవచ్చని చెప్పారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల్లో ఫోన్స్ పట్టుకెళ్లేందుకు ఎలాంటి అనుమతులు లేవు. మీడియా పర్సన్స్ కు ప్రత్యేక పర్మిషన్ తో తమ ఫోన్స్ ను తీసుకెళ్లవచ్చని ఈసీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 26,721 సర్వీస్ ఓటర్లు ఎలక్ట్రానిక్ విధానంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలిపారు.  అందులో 4 లక్షల 61 వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. 80 ఏళ్లకు పైబడిన 26,473  సీనియర్ సిటిజన్స్ ఇంటి నుంచే ఓటు వేసినట్టు వెల్లడించారు.


ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 2,443 ఈవీఎం టేబుళ్లు.. 443 పోస్టల్ బ్యాలెట్  టేబుళ్లను ఏర్పాటు చేసినట్టు ఈసీ ప్రకటించింది. మరోవైపు ఏఫీలో 175 శాసన సభ స్థానాలకు గాను 2,446 టేబుళ్లు.. 557 పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన టేబుళ్లను ఉపయోగించనునట్టు వెల్లడించింది.  ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛీనయ,హింసాత్మక సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు.  ఇప్పటికే ఓటింగ్ లెక్కింపు జరిగే ప్రాంతాలను భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నారు.  


Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter