AP Exit Poll Results 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల తర్వాత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఏపీలో నాల్గో విడతలో భాగంగా మే 13న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ సర్వే సంస్థలు ఏపీలో తదుపరి ప్రభుత్వం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే పట్టం కట్టాయి.  కానీ ఆరా సంస్థ మాత్రం ఏపీలో తదుపరి ప్రభుత్వం వైసీపీనే ఏర్పాటు చేయనున్నట్టు ఘంటాపథంగా చెప్పింది. ఆరా ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీకి 98-104 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడం ఖాయం అంటూ పేర్కొంది. అటు టీడీపీ కూటమికి 71-81 స్థానాలు దక్కనున్నట్టు పేర్కొంది. ఇక ఆరా సర్వే సంస్థ ఈ మధ్యకాలంలో ఇచ్చిన పలు సర్వేలు నిజం కావడంతో ఈ సర్వే సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లకు గాను 151 సీట్లను గెలుచుకొని భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అటు లోక్ సభలో 22 ఎంపీ సీట్లు.. అటు తెలుగు దేశం పార్టీ 23 సీట్లకే పరిమతమైంది. జనసేనకు 1 సీటు వచ్చింది.  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter