AP Exit Poll Results 2024: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ఎన్నికలు జరిగాయి. నిన్నటితో 7వ విడత పోలింగ్ తో మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. దీంతో సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించాయి. ఇక కేంద్రంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్టీయే కూటమి మూడోసారి అధికారంలోకి రాబోతున్నట్టు చెబుతున్నాయి. అటు ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం మెజారిటీ సంస్థ సర్వేలు కూటమిదే అధికారం అని చెబుతున్నాయి. మరోవైపు కొన్ని సర్వే సంస్థలు అధికారం వైసీపీపై మొగ్గు చూపాయి. ఏది ఏమైనా అసలైన ఫలితాల కోసం మరో రెండు వెయిటింగ్ తప్పదు. ఈ నేపథ్యంలో టీడీపీ వ్యవస్థాకుడు ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ మూడోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తారా అనేది ఆసక్తిగా మారింది. ఆయనకు ప్రత్యర్దిగా కాకినాడ శ్రీపీఠం అధినేత పరిపూర్ణానంద నుంచి గట్టి పోటీ ఇచ్చారని సర్వే సంస్థలు ఘోషిస్తున్నాయి. అయినా.. బాలయ్య మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం అనే ముచ్చట వినబడుతోంది. తన పార్టీకి ఫ్యామిలీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలకృష్ణ థర్డ్ టైమ్ ఎమ్మెల్యేగా బరిలో దిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీపీఠం అధినేతకు టికెట్ రాకుండా బాలయ్య అడ్డుకున్నారని స్వామిజీ చెప్పారు. స్వతహాగా ఆయనకు అక్కడ మంచి పట్టు ఏర్పరుచుకున్నారు. గత రెండు పర్యాయాలు అక్కడ నుంచి పోటీ చేసి నెగ్గిన బాలయ్య.. ఈ సారి ఎమ్మెల్యేగా హాట్రిక్ సాధించి తీరుతారని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. ఇక్కడ బాలయ్యకు ప్రత్యర్ధిగా వైసీపీ తరుపున తిప్పెగౌడ నారాయణ్ దీపికా బరిలో దిగింది. ఆమె కూడా బాలయ్య మాదిరే స్థానికురాలు కాదు. అది కూడా ఆమెకు ప్రతికూలంగా మారింది. బాలయ్య ఇక్కడ నాన్ లోకల్ అయినా.. తన తరుపున ఓ మేనేజర్ ను పెట్టి ఇక్కడ పనులను పర్యవేక్షిస్తున్నారు.


హిందూపురం అసెంబ్లీ నుంచి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ తో పాటు.. ఆయన తనయుడు హరికృష్ణ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది. అటు నందమూరి బాలయ్య కూడా ఈ స్థానం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం లాంఛనమే అని చెబుతున్నారు. ఒకవేళ మెజారిటీ సర్వే సంస్థలు చెబుతున్నట్టు ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే.. బాలయ్య.. మంత్రిగా బాధ్యతులు స్వీకరిస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో రాబోతుందో తెలియాంటే జూన్ 4న వెలుబడే ఎగ్జాట్ పోల్స్.. వరకు చేయాల్సిందే.


Also Read: Telangana Lok Sabha: తెలంగాణలో అనూహ్య ఫలితాలు.. కాంగ్రెస్‌కు బీజేపీ షాక్‌.. కారు షెడ్డుకే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook