AP Exit Poll Results 2024 :  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలు ఏడు విడదల్లో జరిగాయి. నేడు జరిగిన చివరి విడత ఎన్నికలతో మొత్తం ఎన్నికలు ప్రక్రియ పూర్తయింది. ఈ సారి 543 లోక్ సభ సీట్లతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌, ఒడిషా, అరుణాల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు  ఎన్నికలు జరిగాయి. మన దేశంలో ఎగ్జిట్‌పోల్స్‌ 1957లో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలయ్యాయి. అప్పట్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఒపీనియన్‌ అనే సంస్థ మొదట్లో సర్వేలు నిర్వహించేంది.  ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఏపీలో నాల్గో విడతలో భాగంగా గత నెల 13వ తేదిన ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో జరిగిన 175 సీట్లలో బీజేపీ, తెలుగు దేశం, జనసేన కూటమికే అధికారం దక్కబోతుందని తేల్చిచెప్పేసింది. ఓవరాల్‌గా కూటమికి 114 నుంచి 125 సీట్లు లభిస్తాయని తెలిపింది. అలాగే వైసీపీకి 39 నుంచి 49 సీట్లు, ఇతరులకు ఒక స్థానం దక్కనున్నట్లు తెలిపింది. ఎంపీ సీట్లలోనూ 17 నుంచి 18 సీట్లు కూటమికి, 6 నుంచి ఏడు సీట్లు వైసీపీకి దక్కనున్నట్లు పేర్కొంది. ఈ సారి ఎన్నికల్లో  ఏపీ నుంచి NDAకు మెజారిటీ సీట్లు దక్కడం గ్యారంటీ అని చెబుతున్నాయి.


 NDA కూటమికి 359 సీట్లు వస్తాయని రిపబ్లిక్‌ టీవీ- PMARQ సర్వే వెల్లడించింది. ఇండియా కూటమికి 154 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులు 30 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే సంస్ధ పేర్కొంది. ఏపీలో కూటమికే పట్టం కట్టింది కేకే సర్వే. కూటమి దెబ్బకు ఫ్యాన్‌ రెక్కలు కట్  అంటూ ప్రకటించింది. 25 ఎంపీ సీట్లలో 25 కూటమికే దక్కనున్నట్లు తెలిపింది. అసెంబ్లీ విషయంలో కూటమికి 161 స్థానాలు దక్కనున్నట్లు తెలిపింది. వైసీపీకి 14 సీట్లు మాత్రమే రానున్నట్లు తెలిపింది.


ప్రముఖ సర్వే ఏజెన్సీ రైజ్ సంస్ధ ఏపీలో 113-122 సీట్లు గెలుస్తుందని పేర్కొంది. అటు అధికార వైయస్ఆర్సీపీకి 48-60 సీట్లు సాధించే అవకాశం ఉంది.
ఇతరులు 1 సీటు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.


జనగళం
జనగళం సర్వేలో ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి  104 - 118 సీట్లు.. వైసీపి 44- 57 సీట్లు గెలుస్తుందని చెప్పింది. ఇతరులు అసలు ఛాన్సే లేదని పేర్కొంది.


పయనీర్ సంస్థ తెలుగు దేశం కూటమికే 144 సీట్లు.. వైసీపీ 31 సీట్లు గెలుస్తుందని వాళ్ల సర్వేలు పేర్కొన్నారు.


పీపుల్స్ పల్స్ సంస్థ ఏపీలో  ప్రతిపక్ష తెలుగు దేశం కూటమి.. 111 -135 సీట్లు సాధిస్తుందని తేల్చిచెప్పింది. అటు అధికార వైసీపీకి 46- 60 సీట్లు గెలుస్తుందని పేర్కొంది.
 


న్యూస్‌ 18 ఎగ్జిట్‌ పోల్స్‌: ఏపీలో వైసీపీ 5-8 లోక్‌సభ స్థానాలు, టీడీపీ కూటమి 19-22 లోక్‌సభ స్థానాలు, తెలంగాణలో కాంగ్రెస్‌ 5-8, బీజేపీ 7-10, బీఆర్ఎస్‌ 2-5 లోక్‌సభ స్థానాలు'


ఆరా ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీకి 98-104 అసెంబ్లీ స్థానాల్లో విజయం, టీడీపీ కూటమికి 71-81 స్థానాలు


ABP-C Voter: వైసీపీ 97-108, టీడీపీ కూటమి 67-78.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై జన్‌మాత్ పోల్స్ ఫలితాలు ఇవే..
==> YSRCP - 95-103
==> టీడీపీ పొత్తు – 67-75
తుది అంచనా వేసిన ఓట్ షేర్
==> YSRCP - 51%
==> టీడీపీ పొత్తు – 45%
==> కాంగ్రెస్ + - 2%
==> ఇతరులు – 2 % 


దేశ వ్యాప్తంగా 


NDTV: ఎన్డీఏ 365, ఇండియా కూటమి 142, ఇతరులు 36... న్యూస్‌ నేషన్‌: ఎన్డీఏ 342-378, ఇండియా కూటమి 153-169



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter