AP Exit Poll YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు ఎగ్జిట్‌ పోల్స్‌ అత్యంత ఆసక్తిగా ఉన్నాయి. కొన్ని సర్వేలు మినహా ఏ సర్వే చూసినా కూడా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా నివేదికలు వచ్చాయి. కూటమిగా వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీకి భారీ భంగపాటు తప్పదని తెలుస్తోంది. అయితే అనూహ్యంగా ఏపీ రాజకీయాల్లోకి తెలంగాణ నుంచి వచ్చిన వైఎస్‌ షర్మిల పాత్ర మాత్రం ఎక్కడా కనిపించలేదు. పదుల సంఖ్యలో వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ నివేదికల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్‌ పార్టీ పేరు వినిపించలేదు. ఇక షర్మిల పోటీ చేసిన కడప లోక్‌సభ స్థానం విషయంలో షర్మిల ప్రస్తావన రాలేదు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana Lok Sabha: తెలంగాణలో అనూహ్య ఫలితాలు.. కాంగ్రెస్‌కు బీజేపీ షాక్‌.. కారు షెడ్డుకే?


గత ఎన్నికల్లో తన సోదరుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసిన షర్మిల.. ఈ ఎన్నికల్లో అన్నకు వ్యతిరేకంగా వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆమె ఆ పార్టీకి అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. హస్తం పార్టీలో చేరి ఏపీ రాజకీయాల్లో షర్మిల సంచలనం రేపారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీకి షర్మిల రాకతో జవసత్వాలు వచ్చాయి. నిస్తేజంలో ఉన్న హస్తం పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. 

Also Read: Hyderabad Lok Sabha: మాధవీలతకు భారీ షాకిచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌.. అసద్‌ గెలవబోతున్నారా?


 


అయితే ఎన్నికల సమయంలోకి వచ్చే వరకు షర్మిల తన ప్రభావం కోల్పోయారు. ఎన్నికల ముందు తన ప్రసంగాలతో సంచలనం రేపి దూకుడు కనబర్చిన ఆమె ఎన్నికల సమరంలో కొంత వెనక్కి తగ్గారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో సాధ్యమైనంత ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసింది. అయితే షర్మిల తన బాబాయి వైఎస్‌ వివేకా హత్యను ప్రధానాంశంగా చేసుకుని కడప లోక్‌సభ బరిలో నిలిచారు. సిట్టింగ్‌ ఎంపీ వైఎస్‌ అనివాష్‌ రెడ్డి లక్ష్యంగా ఆమె రాజకీయం చేశారు.


అయితే షర్మిల వేసిన పాచికలు పారలేదని సమాచారం. ఆ పార్టీకి బలం లేని చోట ఆమె పోటీ చేయడం.. వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా నిలబడడం వంటివి షర్మిలకు ప్రతికూలంగా మారాయి. దీనికితోడు చంద్రబాబును గెలిపించేందుకు షర్మిల రంగంలోకి దిగారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. దీంతోపాటు ఏపీ రాష్ట్ర భవిష్యత్‌కు కీలకమైన ఎన్నికలు కావడంతో షర్మిలకు వేస్తే ఓటు నిర్వీర్యం అవుతుందనే భావనలో ఓటర్లు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ, కూటమి మధ్య నువ్వానేనా అని జరిగిన పోరులో షర్మిల పాత్ర కనిపించలేదు. ఆమెకు కనీసం డిపాజిట్లు కూడా లభించవని సర్వే సంస్థలు చెబుతున్నాయి. తెలంగాణను వదిలేసి ఏపీలోకి వచ్చి షర్మిల పరువు పోగొట్టుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆమె ఏ స్థానంలో నిలిచారు? ఎంత ప్రభావం చూపించారనేది ఈనెల 4వ తేదీన కనిపించనుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter