AP Jobs 2021: ఏపీలో 2,296 Gramin Dak Sevak Postsకు నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు
Apply Online for 2296 AP Gramin Dak Sevak Posts: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ఇండియన్ పోస్టాఫీసు శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,296 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
AP GDS Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో ఎన్నో సేవలు అందిస్తున్న సంస్థ ఇండియా పోస్ట్ గ్రామీణ్ డాక్ సేవక్(Gramin Dak Sevak Jobs 2021) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3,446 జీడీఎస్ పోస్టులుండగా.. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి 2,296 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఇండియా పోస్టాఫీసు నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు 2,296, వాటి వివరాలు
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM Posts)
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM Posts),
ఏబీపీఎం పనినే డాక్ సేవక్ పోస్టులు అంటారు.
అర్హతలు: దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. స్థానిక భాష మాట్లాడటం, రాయడం కూడా వచ్చి ఉండాలి. ఈ ఉద్యోగాలు(Recruitment 2021) కావాలనుకునే అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
Also Read: 7th Pay Commission: ఎల్‌టీసీ అలవెన్స్ చెల్లింపులపై 7వ వేతరణ సంఘం గుడ్ న్యూస్
వయసు: ఈ ఏడాది జనవరి 27 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి
దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో అప్లై చేయాలి
దరఖాస్తు ప్రారంభం : 27.01.2021
దరఖాస్తు చివరి తేదీ: 26.02.2021
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ https://appost.in/gdsonline/
Also Read: New Rules from February 2021: ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త నియమాలు, రూల్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook