Krishnam raju Smruti Vanam: రెబల్ స్టార్ కృష్ణంరాజు పేరు మీద స్మృతివనం ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో జరిగిన ఆయన సంస్మరణ సభలో ఏపీ మంత్రులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కారుమూరి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పర్యాటక మంత్రి ఆర్కే రోజా, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులంతా  ప్రభాస్ (Prabhas), శ్యామలాదేవిని కలిసి సానుభూతి ప్రకటించడంతోపాటు కృష్ణంరాజు సేవలను కొనియాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కృష్ణంరాజు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని మంత్రి రోజా (Tourism Minister RK Roja) అన్నారు.  ఆయన పేరిట మెుగల్తూరు తీర ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల స్థలం ఏపీ టూరిజం డిపార్ట్ మెంట్ తరుపున కేటాయించినున్నట్లు ఆమె తెలిపారు. ఈ విషయాన్ని కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తెలిపినట్లు రోజా చెప్పారు. కన్నప్ప అన్నా, బ్రహ్మన్న పేరు చెప్పినా కృష్ణంరాజు గుర్తుకొస్తారని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ప్రభాస్ తన సొంత గ్రామానికి రావడంతో అభిమానులు భారీగా త‌ర‌లి వ‌చ్చారు. 


Also Read: AP Award: పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధిలో రాష్ట్రానికి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook