ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో ఇకపై ఆన్ లైన్ రమ్మీ , పోకర్ గేమింగ్ లపై నిషేధం విధించారు. పేదల బతుకుల్ని చిదిమేస్తున్నట్టు వస్తున్న వార్తల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ కేబినెట్  ( Ap cabinet meeting ) అమరావతిలో సమావేశమై..పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్ లైన్  రమ్మీ ( online rummy ) , పోకర్ ( poker games ) గేమ్ లను నిషేధించింది. దీంతోపాటు మరి కొన్ని కీలక నిర్ణయాల్ని తీసుకుంది. రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పధకం అమలుతో పాటు పలు అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బాపట్ల, మార్కాపురంలో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం స్థలం కేటాయించడానికి కేబినెట్ ( Cabinet ) ఆమోదించింది. ఉచిత విద్యుత్ పధకంలో మార్పులు చేసినా...ఒక్క రైతుకు కూడా నష్టం లేకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ పథకంలో ప్రస్తుతం ఉచిత విద్యుత్‌ పొందుతున్న కనెక్షన్లకు మీటర్లు బిగించనున్నారు. ముందుగా శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్‌ 1 నుంచి పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తారు. వచ్చేఏడాది ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు చేయనున్నారు. రాష్ట్రంలో పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అమలు చేయడంతో పాటు ఫీడర్ల అభివృద్ధికి రూ.1700 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇప్పటికే రాష్ట్రంలో గుర్తించిన లక్ష అనధికారిక ఉచిత విద్యుత్‌ కనెక్షన్లను క్రమబద్ధీకరించనుంది.


ఆన్ లైన్ లో జూదం ఆడుతూ పట్టుబడితే ఆరు నెలల జైలుశిక్ష విధించాలని కేబినెట్ నిర్ణయించింది. అదే విధంగా ఆన్ లైన్ రమ్మీ, పోకర్ నిర్వాహకులకు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రెండేళ్లు జైలు శిక్ష విధించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు 1974 ఏపీ గేమింగ్ చట్టానికి సవరణలు చేసింది.  Also read: AP ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు