AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, బకాయిల చెల్లింపుకు 5500 కోట్ల విడుదలకు ఆదేశాలు
AP Government: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు కొలిక్కి వచ్చాయి. ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Government: ఏపీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి,. ఉద్యోగుల పెండింగు సమస్యలైన ఐఆర్, పెండింగ్ డీఏ, సరెండర్ లీవ్స్, పదవీ విరమణ బకాయిలు వంటి వాటిపై ప్రభుత్వం తరపున మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను త్వరలో విడుదల చేసేందుకు అప్పటికప్పుడు చర్చలకు ఆదేశించింది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాలు, సెలవులు, ఇతర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని ఉద్యోగులు ఆశిస్తున్నారు. పీఆర్సీ తక్షణం అమలు చేయాలని కోరుతున్నారు. వాస్తవానికి ఉద్యోగులు గత కొద్దికాలంగా అప్పుడప్పుడూ ఉద్యమిస్తూనే ఉన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరపడం ద్వారా ఉద్యమానికి విరామం ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో దాదాపు 13 ఉద్యోగ సంఘాలు నేతలు పాల్గొన్నారు.
ఉద్యోగుల పెండింగు అంశాలపై చర్చించి సత్వరం వాటి పరిష్కారానికి ఆదేశాలిచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. త్వరలో ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. దీనికోసం పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ నెలలో లేదా వచ్చే నెలవరకూ ఉద్యోగుల బకాయిలు చెల్లించేస్తామన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలకు ప్రభుత్వానికి 5.500 కోట్లు అవసరమౌతాయని, ఈ నిధుల్ని విడుదల చేయాలని ఆర్ధిక శాఖ అధికారులకు ఆదేశించినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇటీవల మరణించిన విశాఖపట్నం ఎంఆర్వో కుటుంబానికి 50 లక్షల పరిహారంతో పాటు ఇంటోల ఒకరికి ఉద్యోగం ప్రకటించారు.
Also read: AP Rajyasabha Elections 2024: వైసీపీలో రాజ్యసభ టెన్షన్, అసంతృప్తుల పరిస్థితి ఏంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook