Employees Strike: ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగులు సమ్మె విరమించారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు కొన్ని ప్రభుత్వం అంగీకరించిన నేపధ్యంలో సమ్మెకు స్వస్తి పలికాయి. అయితే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మాత్రం వ్యతిరేకించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు గత కొద్దిరోజూలుగా నెలకొన్న వివాదం ముగిసింది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగ సంఘాల డిమాండ్లు కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యంగా హెచ్ఆర్ఏను కొద్దిగా పెంచడం, సీసీఏ కొనసాగింపు, అదనపు క్వాంటం పెన్షన్‌ను 70 ఏళ్ల నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిట్‌మెంట్ 23 శాతం కంటే ఎక్కువ చేయాలన్న డిమాండ్‌కు మాత్రం ప్రభుత్వం నిరాకరించింది. ఐఆర్ రికవరీ చేయకూడదని..ఐదేళ్లకోసారి పీఆర్సీ విధానం కొనసాగించాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను మంత్రుల కమిటీ ముందుగానే అంగీకరించింది. మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. చర్చలు ముగిసిన తరువాత మంత్రుల కమిటీ సభ్యులు, ఉద్యోగ సంఘాల కలిసి మీడియాతో మాట్లాడాయి. సమ్మె విరమించుకుంటున్నట్టు ప్రకటించాయి.


అయితే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు (Employees Strike) మాత్రం చర్చల్ని వ్యతిరేకించాయి. ఉపాధ్యాయ సంఘాలు మీడియా సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. ఉద్యోగుల డిమాండ్లలో మొదటిదైన 27 శాతం ఫిట్ మెంట్ సాధించుకోలేకపోయామన్నారు. 30 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది చీకటి ఒప్పందమని విమర్శించారు. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకించారు. డిమాండ్ల పరిష్కారం కోసం తమతో కలిసొచ్చే సంఘాలతో ఉద్యమిస్తామన్నారు. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణలు పాల్గొనగా, ప్రభుత్వం తరపున మంత్రులు పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సీఎస్ సమీర్ శర్మ, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Also read: AP New Districts: హిందూపురం కేంద్రంగా జిల్లా ప్రకటించేవరకూ..పోరాటం ఆగేది లేదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook