Sankranthi Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి సెలవులు పొడగింపు
AP Govt Extended Sankranti Holidays: రాష్ట్రంలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులను పొడగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 18న స్కూల్స్ రీఓపెన్ చేయాల్సి ఉండగా.. మరో మూడు రోజులు సెలవులు పొడగించింది. దీంతో జనవరి 22న స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి.
AP Govt Extended Sankranti Holidays: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి సెలవులు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. మరో మూడు రోజులు సంక్రాంతి సెలవులు పొడిగించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ వెల్లడించారు. జనవరి 22న స్కూళ్లు పునఃప్రారంభమవుతాయని తెలిపారు. సంక్రాంతి నేపథ్యంలో జనవరి 18వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వగా.. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగించినట్లు చెప్పారు. ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు కూడా సంక్రాంతి సెలవుల్లో ఏపీ ప్రభుత్వం మార్పు చేసిన విషయం తెలిసిందే. ముందుగా జనవరి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వగా.. ఆ తరువాత 18వ వరకు పొడగించింది. సెలవు దినాల్లో ఏ స్కూల్ యాజమాన్యం కూడా తరగతులు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.