AP Volunteers: ఏపీలోని వాలంటీర్లకు శుభవార్త. వాలంటీర్ల గౌరవ వేతనాన్ని ఇప్పటికే 750 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు క్యాష్ రివార్డు ఇచ్చేందుకు సిద్దమైంది. పనితీరుని బట్టి క్యాష్ రివార్డుకు అర్హుల్ని ఎంపిక చేస్తారు ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ ఏపీలో అమలు జరుగుతోంది. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ఉండి అర్హులైన ప్రజలకు అందాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న 5 వేల గౌరవ వేతనానికి మేర 750 రూపాయలు జోడించి ఇస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా 25 వేల క్యాష్ రివార్డు ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పటికే ప్రతి ఉగాదికి సేవా వజ్ర, సేవా మిత్ర అవార్డులు ఇస్తున్న ప్రభుత్వం కొత్తగా మరో క్యాష్ రివార్డు ఇవ్వనుంది. వివిధ అంశాల్లో పనితీరుని బట్టి అర్హుల్ని ఎంపిక చేస్తారు. 


వాలంటీర్లకు అభినందన 2024 కార్యక్రమమిది. ఇందులో భాగంగా పెన్షన్, ఆసరా, చేయూత పథకాల అమల్లో మెరుగైన పనితీరు చూపించిన వాలంటీర్లను మండల, పట్టణ, జోనల్ , జిల్లా స్థాయిలో ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి కమిటీలు ఈ ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తాయి. మండల, పట్టణ, జోనల్ స్థాయిలో ఎంపికైన వాలంటీర్లకు 15 వేల క్యాష్ రివార్డ్ ఉంటుంది. అదే నియోజకవర్గ స్థాయిలో ఎంపికైతే 20 వేలు ఇస్తారు. ఇక జిల్లా స్థాయిలో ఎంపికైతే 25 వేల పారితోషికం ఉంటుంది. 


Also read: New Bat Virus: ప్రపంచాన్ని భయపెడుతున్న కొత్త వైరస్, గబ్బిలాల్లో గుర్తింపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook