ఏపీలో పింఛన్‌దారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి మరోసారి శుభవార్త. ఇవాళ్టి నుంచి అంటే కొత్త ఏడాది ప్రారంభం నుంచే కొత్త పెన్షన్ అందనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ ఇప్పటి వరకూ అంటే 2022 ఏడాదిలో నెలకు 2500 రూపాయలు అందుతూ వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వృద్ధాప్య పెన్షన్‌ను ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుతూ వస్తోంది. అంటే 2024 ఎన్నికల నాటికి పెన్షన్ 3 వేల రూపాయలు దాటనుంది. ఇందులో భాగంగా 2023 జనవరి 1 నుంచి అంటే కొత్త ఏడాది ప్రారంభం నుంచి 2750 రూపాయలు పెంచిన పెన్షన్ ఇవ్వనుంది. ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా 2 లక్షల 31 వేల మందికి పెన్షన్ మంజూరు చేసింది. ఫలితంగా దేశంలో అత్యధికంగా 64 లక్షలమందికి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వంగా ఏపీ ప్రభుత్వం నిలిచింది. 


జనవరి 1 నుంచి అంటే ఇవాళ్టి నుంచే ఈ పెంచిన పథకం అమలు కానున్నా..జనవరి 3న రాజమండ్రిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. మరోవైపు జనవరి 1 నుంచి వారం రోజులపాటు పెన్షన్ వారోత్సవాలు జరగనున్నాయి.


2019 ఎన్నికలకు ముందు వృద్ధాప్య పెన్షన్ 1000 రూపాయలుండేది. ఈ పించన్‌ను ప్రభుత్వం తొలుత 2250 రూపాయలు చేసింది. ఆ తరువాత 2022లో 2500కు పెంచింది. ఇవాళ్టి నుంచి 2750 కానుంది. పింఛన్ల కోసం ప్రభుత్వం ఏటా 21,180 కోట్లు ఖర్చు చేస్తోంది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పింఛన్ల కోసం 62,500 కోట్లు ఖర్చు చేసింది. 


Also read: APSRTC: ఏపీఎస్ఆర్టీసీ పండుగ ఆఫర్.. టికెట్ల కొనుగోలుపై అదిరిపోయే డిస్కౌంట్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook