AP IAS Transfers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే 19 మంది సీనియర్ ఐఎఎస్ అధికార్లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా కలెక్టర్లపై బదిలీ వేటు వేసింది. ముగ్గురిని మాత్రం జీఏడీకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో మరో 18 మంది ఐఏఎస్ అధికార్లపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ముగ్గురు జిల్లా కలెక్టర్లను జీఏడీకు నివేదించాలని ఆదేశించిన ప్రభుత్వం మిగిలిన జిల్లా కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఛీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 


గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మీ
విశాఖ కలెక్టర్‌గా విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు
అల్లూరి జిల్లా కలెక్టర్‌గా దినేష్‌కుమార్ నియామకం
కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగిలి షణ్మోహన్ నియామకం
ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రి సెల్వి నియామకం
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి నియామకం
విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి.ఆర్.అంబేడ్కర్ నియామకం
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సి.నాగరాణి నియామకం
చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌కుమార్ నియామకం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా జి.సృజన నియామకం
ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా నియామ
కర్నూలు జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషా
బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు


ఇక విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లికార్జున, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కాకినాడ జిల్లా కలెక్టర్ జే నివాస్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతలను జీఏడీకు రిపోర్ట్ చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. 


Also read: Tirumala Price Down: తిరుమల దర్శనం టికెట్‌, లడ్డూ ధరలు తగ్గుదల.. టీటీడీ ఏం చెప్పింది?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook