Andariki Illu Scheme: అందరికీ ఇళ్లు పధకానికి లబ్దిదారులెవరు, ఎవరెవరికి అర్హత ఉంది, ఎలా అప్లై చేసుకోవాలి

Andariki Illu Scheme: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు గుడ్‌న్యూస్ అందించింది.అందరికీ ఇళ్లు పధకం ప్రవేశపెట్టింది. ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలాలు అందించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం ఎవరెవరు అర్హులో తెలుసుకుందాం.
Andariki Illu Scheme: అందరికీ ఇళ్లు పధకం మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర రెవిన్యూ మంత్రి చైర్మన్‌గా కమిటీ ఏర్పాటైంది.ఈ పధకంలో ఇళ్లు దక్కించుకోవాలంటే ఎవరెవరికి అర్హత ఉందో పరిశీలిద్దాం.
ఏపీ ప్రభుత్వం అందరికీ ఇళ్లు పధకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వనున్నారు.అంతేకాకుండా ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్ధిక సహాయం కూడా అందించనున్నారు. పక్కా ఇళ్లు, ఇంటి స్థలాలు పొందేందుకు అర్హులెవరనే విషయంపై మార్గదర్శకాలు జారీ చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా వైట్ రేషన కార్డు ఉన్నవారికే అర్హత ఉంటుంది. ఇంటి స్థలం కేటాయించిన రెండేళ్లలో ఇంటి నిర్మాణం చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే స్థలం రద్దు కావచ్చు. పదేళ్ల తరువాత యాజమాన్య హక్కులు లభిస్తాయి. గతంలో ఎక్కడైనా ఇళ్లు పొంది ఉంటే ఈ పధకంలో లభించదు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం ఇస్తారు.
గతంలో కేంద్ర , రాష్ట్ర గృహ పధకాల్లో లబ్ది పొందినవారు ఈ పధకానికి అనర్హులు. ఐదు ఎకరాల మెట్టభూమి, 2.5 ఎకరాల మాగాణి ఉంటే ఈ పధకం వర్తించదు. కేవలం ప్రభుత్వ స్థలంలో మాత్రమే ఇంటి స్థలం కేటాయించనున్నారు. గతంలో ఇంటి పట్టా పొంది ఉండి ఇళ్లు కట్టుకోకపోతే అది రద్దు చేసి మరో చోట ఇస్తారు.
ఇంటి స్థలాల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటిపై వీఆర్వో, ఆర్ఐలు విచారణ జరిపి జాబితా సిద్ధం చేస్తారు. లబ్దిదారుల్నించి అభ్యంతరాలు స్వీకరించిన తరువాత తుది జాబితాను ఉన్నతాధికారుల ఆమోదం పొందాక ప్రకటిస్తారు.
Also read: Nara Lokesh: ఏపీ డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్ పేరు ఖరారైనట్టేనా, లోకేశ్ మాటల అర్ధమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి