ఆంధ్రప్రదేశ్ టీచర్లకు ఇక గుడ్‌న్యూస్. రాష్ట్రంలోని టీచర్లను ఇకపై బోధనేతర విధులకు ఉపయోగించకుండా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉపాధ్యాయులు ఇక నుంచి విద్యాబోధనపైనే దృష్టి సారించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ప్రభుత్వం కొత్తగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు ఇక నుంచి బోధనేతర విధులకు వెళ్లరు. టీచర్లు ఇకపై బోధనపైనే దృష్టి సారించాలి. నిర్బంధ విద్యా హక్కు చట్టంలోని కొని నిబంధనల్ని సవరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీచర్ల సేవలు వినియోగించుకుంటామని చట్ట సవరణ చేసింది. విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దోహదపడుతుంది. బోధనేతర బాధ్యతల్ని టీచర్లకు ఇవ్వకూడదని..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. 


బోధనేతర బాధ్యతలపై చాలాకాలంగా టీచర్లు అసంతృప్తిగా ఉన్నారు. పని భారం తగ్గించాలని కోరుతున్నారు. ఇప్పుడీ నోటిఫికేషన్ ప్రకారం టీచర్లకు బోధనేతర పనులు ఉండవు. తప్పనిసరి అయితేనే వినియోగిస్తారు. వర్చువల్ విధానంలో భేటీ అయిన ఏపీ కేబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. 


Also read: Ap Government: 100 బెడ్స్ ఆసుపత్రి నిర్మిస్తే..5 ఎకరాలు ఉచితం, ఢిల్లీ భేటీలో ఏపీ మంత్రి విడదల రజని



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook