ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు (AP Unlock 4.0 Guidelines) విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మెట్రో రైలు సర్వీసులు సైతం నేడు (సెప్టెంబర్ 7న) ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, బహిరంగ కార్యక్రమాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 21 నుండి తొమ్మిదో తరగతి, టెన్త్ క్లాస్ విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఇందుకోసం తల్లిదండ్రులు తమ సమ్మతితోనే పంపుతున్నట్లు రాతపూర్వకంగా అంగీకారం తెలిపాల్సి ఉంటుంది. Telangana Vro System: సంచలన నిర్ణయం.. తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

(Unlock 4.0 Guidelines In AP)  సెప్టెంబర్ 21 నుంచి ఏదైనా విద్య, మతపరమైన, క్రీడలు, రాజకీయాల సమావేశాలకు సంబంధించిన వాటిలో 100 మందికి మించకుండా ఉండేలా అనుమతి కల్పించారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లకు సెప్టెంబర్ 21 నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అంత్యక్రియలకు గతంలో తరహాలోనే కేవలం 20కి మాత్రమే అనుమతి ఉంది. వివాహా వేడుకలకు కేవలం 50 మంది అతిథులతో జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. SRH IPL 2020 Schedule: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 షెడ్యూల్ పూర్తి వివరాలు  


సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు సైతం సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ సినిమా హాళ్లు (మూవీ థియేటర్స్), ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్‌పై ఇంకా నిషేధం కొనసాగనుంది.  Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి
Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు