Sankranthi Holidays 2024: సంక్రాంతి సెలవుల్లో మార్పు చేసిన ఏపీ ప్రభుత్వం, ఎప్పట్నించి ఎప్పటి వరకంటే
Sankranthi Holidays 2024: సంక్రాంతి పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేసింది. సెలవులు ఎప్పట్నించి ఎప్పటివరకో తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sankranthi Holidays 2024: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలతో పాటు స్కూళ్లు, కళాశాలలకు సెలవులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో అన్ని స్కూళ్లకు 10 రోజులు సెలవులు ప్రకటించింది. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని విద్యాలయాలను హెచ్చరించింది.
ఏపీలో సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. వాస్తవానికి జనవరి 16 వరకూ సెలవులుంటాయని అనుకున్నా ఆ తరువాత మార్పు జరిగింది. ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు పదిరోజుల పాటు సెలవులు ప్రకటించింది. తిరిగి 19వ తేదీన స్కూళ్లు తెరవాల్సి ఉంటుంది. ఈసారి జనవరి 13 రెండవ శనివారం, 14వ తేదీ ఆదివారం భోగి, జనవరి 15వ తేదీ సంక్రాంతి పండుగలున్నాయి. రెండ్రోజులు సాధారణ పబ్లిక్ హాలిడేస్ రావడంతో 18 వరకూ సెలవులు పొడిగించినట్టు తెలుస్తోంది. సెలవు దినాల్లో ఏ స్కూల్ యాజమాన్యం కూడా తరగతులు నిర్వహించడానికి వీల్లేదు. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు తెలంగాణలో కూడా సంక్రాంతి సెలవులు ఈ నెల 9 వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ ప్రకటించారు. ఉద్యోగం, చదువు రీత్యా తెలంగాణలో ఉంటున్నవాళ్లు సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు పండుగ రోజుల్లో కూడా తెరిచి..పరీక్షల పేరుతో విద్యార్ధులపై ఒత్తిడి తీసుకొస్తుంటాయి. ఈ తరహా స్కూళ్లను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Also read: VV Vinayak: వైసీపీలో చేరనున్న వివి వినాయక్, కాకినాడ లేదా ఏలూరు నుంచి పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook