AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో వందల కోట్ల అవినీతి, సీఐడీ విచారణకు ఆదేశం
AP Fibernet: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లోని అవినీతి ఆరోపణల్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. నాటి ప్రభుత్వంలో పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఫైబర్ నెట్‌పై ఇప్పుడు దృష్టి సారించింది. ప్రాధామిక దర్యాప్తు నివేదిక పూర్తయింది.
AP Fibernet: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లోని అవినీతి ఆరోపణల్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. నాటి ప్రభుత్వంలో పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఫైబర్ నెట్‌పై ఇప్పుడు దృష్టి సారించింది. ప్రాధామిక దర్యాప్తు నివేదిక పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వ(Tdp government)హయాంలో ఏర్పడిన ఏపీ ఫైబర్ నెట్ సంస్థలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా ఏపీ ఫైబర్ నెట్‌లో భారీగా అవినీతి జరిగినట్టు ప్రాధమిక నివేదికల్లో తేలిందని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతం రెడ్డి తెలిపారు. ప్రాధమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించామని..ప్రభుత్వం సీఐడీ విచారణకు(CID Probe) ఆదేశించిందన్నారు. ఫైబర్ నెట్‌లో టీడీపీ హయాంలో అవకతవకలు జరిగాయని..కాంట్రాక్టర్లకు వందలాది కోట్లను దోచిపెట్టే ప్రయత్నం జరిగిందని చెప్పారు. కోట్లాది రూపాయల కుంభకోణంలో అప్పటి ప్రజా ప్రతినిధులు, అధికారుల పాత్ర ఉందన్నారు.
ఫైబర్ నెట్ (Ap fibernet)ఛైర్మన్‌గా బాథ్యతలు తీసుకునే సమయానికి 650 కోట్ల అప్పు ఉందని గౌతం రెడ్డి(Gowtham Reddy) తెలిపారు. అన్ని చోట్ల లాభాలుంటే..సంస్థలో అప్పులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. సీఐడీ విచారణలో అంతా బయటికొస్తుందని..నాటి నేతలంతా బయటికొస్తారని చెప్పారు. అవినీతికి సంబంధించి పూర్తి ఆధారాలున్నాయని..సీఐడీ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరిపి బాధ్యుల్ని గుర్తించాలని కోరారు.
Also read: AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు, 3 శాతం కంటే తక్కువకు కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook