AP Municipal Elections: రాష్ట్రంలో మరోసారి మున్సిపల్ ఎన్నికల సమరం
AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల సమరం మోగనుంది. మిగిలిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ పనుల్ని పూర్తి చేయాల్సిందిగా పురపాలక శాఖ ఆదేశించింది.
AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల సమరం మోగనుంది. మిగిలిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ పనుల్ని పూర్తి చేయాల్సిందిగా పురపాలక శాఖ ఆదేశించింది.
ఏపీలో మొత్తం 125 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు , నగర పంచాయితీల ఎన్నికలు జరిగాయి. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ( Ysr congress party ) క్లీన్‌స్వీప్ చేసింది. అంటే మొత్తం 87 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇంకా 38 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగాల్సిఉంది. వివిధ కారణాల వల్ల, కోర్టు కేసుల వల్ల ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇందులో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు 2017లోనే జరిగనందున మరో ఏడాది సమయముంది. ఇక మిగిలిన శ్రీకాకుళం, రాజమండ్రి, నెల్లూరు కార్పొరేషన్లు సహా 37 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు( 37 Municipalities and corporations)ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ ఏప్రిల్ 15 నాటికి క్లియర్ చేయాలని పురపాలక శాఖ( Ap municipal Department) మున్సిపల్ కమీషనర్లను ఆదేశించింది.
ఓటర్ల జాబితాల రూపకల్పన, అవసరమైనచోట వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ఎక్కడైతే అవసరమో అక్కడ వార్డుల సంఖ్య పెంచుతూ ప్రతిపాదనలు రూపొందించి..ప్రజల్నించి అభ్యంతరాల్ని స్వీకరించి పరిష్కరించమని ఆదేశించింది. సమీప గ్రామాల్ని విలీనం చేసిన ప్రక్రియ నేపధ్యంలో ఉన్న కోర్టు కేసుల్ని త్వరగా పరిష్కరించాలని మున్సిపల్ శాఖ ఆలోచిస్తోంది. 37 మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల ( Municipal elections)నిర్వహణకు ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా సన్నద్ధంగా ఉండాలని మున్సిపల్ శాఖ భావిస్తోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క మున్సిపాలిటీ మినహా మిగిలిన అన్నింటినీ కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..రానున్న ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించేందుకు ఉత్సాహంతో ఉంది.
Also read: Covid19 vaccination: ఏపీలో ఇక వేగంగా వ్యాక్సినేషన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook