LNG Terminal: కాకినాడ డీప్ వాటర్ పోర్టు మరింతగా అభివృద్ధి చెందనుంది. పోర్టులో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ టెర్మినల్ ఏర్పాటుకు మార్గం సుగమమమైంది. దాదాపు 6 వేల కోట్ల పెట్టుబడితో టెర్మినల్ ఏర్పాటు కానుండటం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో విశాఖపట్నం తరువాత మరో ముఖ్యమైన పోర్టు కాకినాడ డీప్ వాటర్ పోర్టు(Kakinada Deep Water Port). ఈ పోర్టు మరింత అభివృద్ధి చెందనుంది. ముంబైకు చెందిన హెచ్ ఎనర్జీ అనుబంధ సంస్థ ఈస్ట్‌కోస్ట్ కన్‌స్ట్రక్షన్స్..ఎల్ఎన్‌జి గ్యాస్ టెర్మినల్ ఏర్పాటు చేయనుంది. దాదాపు 5 వేల 4 వందల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఎల్‌ఎన్‌జి టెర్మినల్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భారీ వ్యయంతో కూడిన ప్రాజెక్టు కావడంతో 50 ఏళ్లపాటు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కేఎస్పీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 23 ఏళ్ల గడిచిపోవడంతో మరో 27 ఏళ్లు మాత్రమే మిగిలాయి. దాంతో టెర్మినల్ ఏర్పాటుకు ఈస్ట్‌కోస్ట్ సంస్థ వెనుకంజ వేసింది. అయితే గడువు ముగిసిన తరువాత కూడా టెర్మినల్ కొనసాగించేలా ఏపీ మారిటైమ్ బోర్డు లేదా కొత్త ఆపరేటర్‌తో కొనసాగించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలుపడంతో ఈస్ట్‌కోస్ట్ సంస్థ ముందుకొచ్చింది.


తొలిదశలో 16 వందల కోట్ల పెట్టుబడితో ఎల్‌ఎన్‌జి టెర్మినల్(LNG Terminal), 2 వందల కోట్ల పెట్టుబడితో ఎల్సీఎన్‌జి స్టేషన్స్ నిర్మించే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డుకు(Ap Maritime Board) ఈస్ట్‌కోస్ట్ సంస్థ ప్రతిపాదనలు పంపింది. రెండవ దశలో మరో 3 వేల 6 వందల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఒప్పందంపై స్పష్టత రావడంతో వర్షాకాలం ముగిశాక..సంస్థ పనులు ప్రారంభించనుంది. 5 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ఎల్ఎన్‌జి టెర్మినల్ ఏర్పాటు కానుంది. ఈ టెర్మినల్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వందలమందికి ఉపాధి లభించనుంది. ఏటా 1 మిలియన్ టన్నుల ఎల్ఎన్‌జి సరఫరా చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో 12 వందల కోట్ ఆదాయంతో పాటు డీప్ వాటర్ పోర్టులో రాష్ట్రా వాటా రూపంలో మరో వంద కోట్ల ఆదాయం లభించనుంది. అటు గంగవరం పోర్టులో కూడా అదానీ గ్రూపు (Adani Group)ఎల్ఎన్‌జీ టెర్మినల్ ఏర్పాటు కానుంది. రెండు టెర్మినల్స్ పూర్తయితే రాష్ట్రానికి రానున్న 15 ఏళ్లలో 50 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది.


Also read: MLA Roja on KRMB row: తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రులకు ఎమ్మెల్యే రోజా హెచ్చరిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook