AP Floods Compensation: వరదలతో ఏపీ అతలాకుతులమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో భారీవర్షాలు, వాగులు వంకర్లు తిరుగుతున్నాయి. ప్రాణ, ధన, ఆస్తి నష్టం కూడా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా కలెక్టర్‌ ఆఫీసులో మకాం వేసి దగ్గర ఉండి సహాయక చర్యలను చేపట్టారు. అయితే, ఇలా నష్టపోయిన ప్రజలకు ఆర్థికంగా ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వరద బాధితులకు ఆర్థికంగా సాయం అందించడానికి కార్యాచరణ రచిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా వరదలతో ఇల్లు కోల్పోయిన వారికి రూ.5 లక్షలు, ఇందిరమ్మ ఇళ్లు ప్రకటించింది. వరదలతో పాక్షికంగా నష్టపోయిన వారికి రూ.16,500 ప్రకటించిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, ఇప్పుడు విజయవాడ ప్రజలకు ఆర్థికంగా సాయం అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోంది. వరదలతో ఇళ్లలో నీళ్లు చేరి కొన్ని రోజులుగా ఉన్న పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇళ్లు మాత్రమే కాదు ఇక్కడి వాహనాలు కూడా పూర్తిగా నీట మునిగిన ఘటనలు చూశాం. ఈ సందర్భంగా వారికి కూడా ఆర్థికంగా భరోసా కల్పించేందుకు చంద్రన్న ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!


కాగా, విజయవాడలో పాక్షికంగా నీట మునిగిన ఇళ్లకు రూ.10 వేలు, పూర్తిగా నీట మునిగినవారికి రూ.25 వేలు. ఇక వరదల్లో వాహనాలు కూడా నీట మునిగాయి. అవి కూడా మరమ్మతులు చేయించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ మేర వారికి కూడా ఆర్థిక సాయం అందించేందుకు రూ.10 వేలు ప్రకటించనుంది. అంటే కారు, ఆటోలకు రూ.10 వేలు, టూవీలర్‌ బైకులకు రూ.3 వేలు ప్రకటించనుంది. అలాగే పంట నష్టం వాటిల్లిన వారికి కూడా ఆర్థికంగా ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. పంట నష్టం అంచనా వేసి తుదినిర్ణయం ప్రభుత్వం తీసుకోనుంది. క్షేత్ర స్థాయిలో పరిశీలనలు జరిపి ఈ మేర ఆర్థిక సాయం ప్రకటించనుంది. ఈ సాయం పై రానున్న రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వరద నీటి ప్రభావం తగ్గిపోయింది. కానీ, ఇంకా బురద అలాగే ఉంది. ఫైరింజన్లతో బురదను తొలగిస్తోంది ప్రభుత్వం.


ఇదీ చదవండి: తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పలువురు మృతి..


ధవళేశ్వరం ఉగ్రరూపం..
మరోవైపు ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ఈ పరిస్థితులు ఏర్పడుతోంది. ఇప్పటికే నీటి మట్టం పెరిగింది 13.75 అడుగులు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయింది. ఈ నేపథ్యంలో గోదావరి నది పరీవాహక గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఉధృతి నేపథ్యంలో గణేష నిమజ్జనాలు కూడా రానున్న 48 గంటలపాటు నిషేధించారు. ఇక సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.