Sajjala Ramakrishna Reddy On Ap Bifurcation: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తీరును సవాల్ చేస్తూ సుప్రీంలో కేసుపై ఉండవల్లి చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. విభజన చట్టం అసంబద్దం అని సుప్రీంకోర్టులో కేసు విచారణలో  ఉందని.. కుదిరితే మళ్లీ ఎపీ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే తమ పార్టీ విధానం అని అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తాము తొలి నుంచి పోరాడుతున్నామని.. ఉండవల్లి పనిగట్టుకుని జగన్ వైపు చూపించినట్లు తెలుస్తోందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీసీ గర్జన సభ గురించి సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్రంలో 85శాతం పైగా ప్రజలు ఎన్నుకున్న బీసీ వైసీపీ  ప్రతినిధులు జయహో బీసీ సభకు వచ్చారని అన్నారు. బీసీ నేతలంతా అందరూ ఒకచోట చేరి సీఎం జగన్‌పై విశ్వాసం చూపించారని పేర్కొన్నారు. జయహో సభలో సీఎం మాట్లాడేటప్పుడు  ఖాళీ కుర్చీలు ఉన్నయంటూ  ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని మండిపడ్డారు. దింపుడు కళ్లెం ఆశతో జగన్‌పై వ్యతిరేకత ఉన్నట్లు  సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.


'స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గడానికి టీడీపీనే కారణం. ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో కేసు వేసి బీసీల రిజర్వేషన్‌పై కేసు వేసి రిజర్వేషన్లను అడ్డుకున్నారు. రాష్ట్రానికి ప్రథమ శత్రువుగా చంద్రబాబు, టీడీపీ ఉంది. భవిష్యత్తులో ఎస్సీ, మైనార్టీలపైనా  సభలు పెడతాం. రీజినల్ పార్టీలో నాయకుడికి సన్నిహితంగా ఉన్నవారు సభలో ఉండటం సహజమే..' అన్నారు.
 
అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని సజ్జల గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి పోరాటం చేస్తోంది తమ పార్టీనేనని అన్నారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే  తొలుత స్వాగతించేది వైసీపీనేనని.. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో తమ వాదనలు బలంగా వాదనలు  వినిపిస్తామన్నారు. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి.. లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరతామన్నారు. 


'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలసి ఉండాలన్నదే ఇప్పటికీ మా విధానం. రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే   న్యాయస్థానంలో  కేసు వేశారు. విభజన చట్టంలో హామీల అమలు కోసం కాదు. విభజన చట్టంలో  హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉంది. రెండు రాష్ట్రాలు కలసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. రెండు రాష్ట్రాలు  కలిసే దాని కోసం వైసీపీ పోరాటం చేస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్‌పై అక్రమాలు రావాల్సిన సమయంలో బయటకు వస్తాయి. స్కిల్ డెవలప్‌మెంట్‌లో అక్రమాలపై విచారణ జరుగుతుంది. చంద్రబాబు, లోకేష్  అక్రమాలు చేశారనే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి..' అని సజ్జల రామకృష్టారెడ్డి తెలిపారు.


Also Read: Megastar Chiranjeevi: ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర.. మెగాస్టార్ చిల్ మోడ్  


Also Read: Chittoor Road Accident: డీజిల్ ఆదా చేద్దామని ఆశతో నిర్లక్ష్యం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook