Black fungus cases in AP : అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు  జారీ చేసింది. ఈ మేరకు బుధవారమే సంబంధిత ఉన్నతాధికారుల నుంచి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు ఉత్తర్వులు వెలువడినట్టు తెలుస్తోంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ  పథకం కింద చేర్చి రోగుల చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తున్న ఏపీ సర్కారు తాజాగా బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను (Black fungus treatment) కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడం విశేషం. ఏపీలో ఇప్పుడిప్పుడే బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటం, అందులోనూ కరోనా బారిన పడి కోలుకున్న వారిలోనే బ్లాక్ ఫంగస్ లక్షణాలు అధికంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: COVID-19 in AP: ఏపీలో మరోసారి 23 వేలు దాటిన కరోనా కేసులు


ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బ్లాక్ ఫంగస్ బారినపడే బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చును ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఏపీలో ఇప్పటివరకు 9 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు (Black fungus cases in AP) గుర్తించారు. అందులో చిత్తూరులో 3, కర్నూలులో 2, అనంతపురంలో 2, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 1 చొప్పున కేసులు వెలుగుచూశాయి.


ఇదిలావుంటే, మరోవైపు ఏపీలో లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది. మే 20 వ తేదీ నుంచి లాక్‌డౌన్ సమయాల్లో మార్పులు ఉండబోతున్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలను ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసిన ప్రభుత్వం.. లాక్‌డౌన్ సమయాల్లో (Lockdown timings in AP from May 20th) ఎలాంటి మార్పులు లేవని స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.


Also read : Ys Jagan: ప్రభుత్వాసుపత్రుల్లో సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్ మెషీన్లను ప్రారంభించిన వైఎస్ జగన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook