ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో ఇక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఆర్డీఏ రద్దుతో పాటు  పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ( Governor ) ఆమోదముద్ర వేయడంతో వేగంగా పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పుడిక సీఆర్డీఏ స్థానంలో ఏఎంఆర్డీఏ ఏర్పాటైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశానికి తెరపడింది. అమరావతి ( Amaravathi ) స్థానంలో రాష్ట్రానికి మూడు కొత్త రాజధానుల ( Three Capitals ) ఏర్పాటుకు మార్గం క్లియరైంది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ( Ap governor BiswaBhushan ) Harichandan  ఆమోదముద్ర వేయడంతో పాటే చకచకా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఆర్డీఏను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం ఆ స్థానంలో కొత్తగా అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ( Amaravathi metropolitan region development authority ) ను నోటిఫై చేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై సీఆర్డీఏ పరిధి అంతా ఏఎంఆర్డీఏ పరిధిలో వస్తుందని ప్రకటించింది. సీఆర్డీఏ రద్దు చట్టం 2020 అమలుతో ఇకపై సీఆర్డీఏ 2014 ఉండదని నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొంది. ఏఎంఆర్డీఏతు మున్సిపల్ శాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడిగా 11 మంది అధికారులు సభ్యులుగా కమిటీ ఏర్పాటైంది. కమిటీలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఏఎంఆర్డీఏ కమీషనర్, గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లు, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ లు ఉంటారు.  ఏఎంఆర్డీఏ తొలి కమీషనర్ గా లక్ష్మీ నరశింహంను ప్రభుత్వం నియమించింది. 


పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదంతో విశాఖనగరం ఇకపై ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, అమరవాతి  శాసన రాజధానిగా , కర్నూలు న్యాయ రాజధానిగా ఉండునున్నాయి. మూడు రాజధానుల సీఎం జగన్ లక్ష్యం నెరవేరనుంది.