అమరావతి : టీటీడీ ఆస్తుల వేలంపై ( TTD lands auction ) ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. పలు ప్రజా సంఘాలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న నేపథ్యంలో టీటీడీ భూముల అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ( AP govt ) సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని టీటీడీని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారిచేసింది. ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే ముందు సంబంధిత మత పెద్దలు, భక్తులు, ఇతరుల నుంచి అభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. TTD lands issue : టీటీడీ వివాదంపై పాత ఆధారాలు బయటపెట్టిన బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి )


అమ్మకానికి పెట్టాలనుకుంటున్న టిటిడి భూముల్లో అవసరమైతే టీటీడీ దేవాలయ నిర్మాణాలు, ధర్మ ప్రచారాలు, మతపరమైన వ్యవహారాలకు వినియోగించే అవకాశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం సూచించింది. ఈ అంశాలన్నీ పరిశీలించే వరకు భూముల విక్రయాల ప్రక్రియను నిలుపుదల చేయాలని ప్రభుత్వం స్పష్టంచేయడం గమనార్హం.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..