YS Jagan Mohan Reddy Passport Renewal: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన టూర్‌కు లైన్ క్లియర్ అయింది. పాస్‌పోర్టు రెన్యువల్‌కు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. జగన్ పాస్‌పోర్టు గడువును ఐదేళ్లకు పెంచాలని ఆదేశించింది. ప్రజా ప్రతినిధుల కోర్టు పాస్‌పోర్ట్ రెన్యువల్‌ను ఒక సంవత్సరానికి పరిమితం చేసిన విషయం తెలిసిందే. ఐదేళ్లకు పెంచాలని ఆదేశించిన కోర్టు.. విజయవాడ కోర్టు చెప్పిన విధంగానే జగన్ స్వయంగా వెళ్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రూ.20 వేల పూచీకత్తు చెల్లించాలని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు విధించిన మిగిలిన షరతులు యాథావిధిగా ఉంటాయని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Infinix Zero 40: కేక పెట్టించే ఫీచర్లు, 108MP ప్రైమరీ, 50MP సెల్ఫీ కెమేరాతో Infinix


చాలా రోజుల నుంచి జగన్ లండన్‌ టూర్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే పాస్‌పోర్టు చిక్కులు రావడంతో ఆగిపోయారు. గతంలో ముఖ్యమంత్రి హోదాలో డిప్లోమాటిక్ పాస్‌పోర్టు ద్వారా వెళ్లేవారు. అధికారం కోల్పోవడంతో ఆ పాస్‌పోర్టు రద్దయింది. దీంతో సాధారణ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ వేయగా.. ఐదేళ్లపాటు రెన్యువల్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని సంప్రదించగా.. జగన్‌పై విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో పరువు నష్టానికి సంబంధించి ఓ కేసు పెండింగ్‌లో ఉందని అబ్జక్షన్ చెప్పింది. ఎన్‌వోసీ కోసం ప్రజా ప్రతినిధుల కోర్టును ఆశ్రయించగా.. ఏడాది మాత్రమే రెన్యువల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తమ ముందు స్వయంగా హాజరై రూ.20 వేల పూచీకత్తు సమర్పించాలని కండీషన్ పెట్టింది.


ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశాలపై జగన్ మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పాస్‌పోర్టు ఐదేళ్లకు రెన్యువల్ చేయాలని.. విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు నిబంధనలు సహేతుకంగా లేవని పిటిషన్‌లో పేర్కొన్నారు. పాస్‌పోర్టును ఐదేళ్లకు పొడగించాలని సీబీఐ కోర్టు జారీ చేసిన ఆదేశాలను కూడా ప్రస్తావించారు. సోమవారం రెండు వైపులా వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. బుధవారం తీర్పును వెల్లడిస్తామని తెలిపింది. ఈ మేరకు ఇవాళ తీర్పును ఇస్తూ.. జగన్‌కు ఊరట కలిగించింది. పాస్‌పోర్టును ఐదేళ్లకు రెన్యువల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రతినిధుల కోర్టులో స్వయంగా వెళ్లి రూ.20 వేల పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. కోర్టు తీర్పులో జగన్ లండర్ టూర్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. 


Also Read: Malaika father Suicide: స్టార్‌ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య.. 7వ ఫ్లోర్‌ నుంచి దూకి సూసైడ్‌..   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.