High Court on Sec Orders: ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాల్ని కొట్టివేసిన హైకోర్టు
High Court on Sec Orders: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరిధి దాటి వ్యవహరిస్తున్నారంటూ పలువురు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలకు బలం చేకూరింది.
High Court on Sec Orders: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరిధి దాటి వ్యవహరిస్తున్నారంటూ పలువురు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలకు బలం చేకూరింది.
ఏపీలో పంచాయితీ ఎన్నికల ( Ap Panchayat Elections ) ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వానికి, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec Nimmagadda Ramesh kumar )కు మధ్య పంచాయితీ కొనసాగుతూనే ఉంది. తాజాాగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆంక్షలు విధించడంతో ఘర్షణ పెరిగింది. ఫిబ్రవరి 21 వరకూ అంటే ఎన్నికలకు ముగిసేవరకూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని..కనీసం మీడియాతో కూడా మాట్లాడకుండా చేయాలని వినూత్న ఆంక్షలు విధిస్తూ..డీజీపీ గౌతమ్ సవాంగ్ ( Dgp Gowtham Sawang )కు ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని 243 కే నిబంధన ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా తనకున్న విశేషాధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేశానని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు మండిపడ్డారు. గీత దాటుతున్నారని..నియంత్రణలో ఉండాలంటూ ప్రభుత్వ పెద్దలు నిమ్మగడ్డపై తీవ్ర ఆరోపణలు చేశారు.
నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra reddy ) హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ చర్యల్ని రాజ్యాంగవిరుద్ధంగా అభివర్ణిస్తూ..ఏకపక్ష చర్యగా ప్రకటించాలని కోర్టులో వాదన విన్పించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డికి ఉందన్న పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనలతో హైకోర్టు ( Ap High court ) ఏకీభవించింది. రాష్ట్ర మంత్రిగా ఆయన ఎక్కడైనా పర్యటించవచ్చని తీర్పులో స్పష్టం చేసింది. మంత్రిపై ఇంట్లోనే ఉండాంటూ ఆయన విధించిన ఆంక్షలను చెల్లవని పేర్కొంటూ ఎస్‌ఈసీ జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook