AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై పిటీషనర్ అభ్యంతరాలు, కారణాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఏప్రిల్ 2 నుంచి పరిపాలన ప్రారంభం కానుంది. మరోవైపు ఇదే అంశంపై అంటే కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇచ్చిన ముసాయిదాను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. గుంటూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలకు చెందిన ముగ్గురు పిటీషనర్లు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ముసాయిదా జీవో నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.


పిటీషనర్ల అభ్యంతరాలివే


కొత్త జిల్లాల ఏర్పాటు ఆర్టికల్ 371 డి, ఏపీ విభజన చట్టం సెక్షన్ 97కు విరుద్ధం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికై ఉద్దేశించిన ఆరు సూత్రాల ప్రణాళికకు వ్యతిరేకం
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల ఉత్తర్వుల చట్టం 1975కు వ్యతిరేకం. కొత్త జిల్లాలతో స్థానికత స్వరూపం మారిపోతుందని అభ్యంతరం
కొత్త జిల్లాల ఏర్పాటుతో జోన్లు మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు
రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించనంతవరకూ..కొత్త జిల్లాల విభజన సాధ్యం కాదు
కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం


Also read : Janasena Avirbhava Sabha: నేడు జనసేన ఆవిర్భావ సభ.. భావికార్యాచరణపై పవన్‌ ప్రకటన!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook