అమరావతి: ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు సంబంధించిన మార్కుల మెమోలో గ్రేడింగ్‌తో పాటు మార్కులు కూడా తెలియజేస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నత చదువులు, ఉపాధి కోసం వెళ్లినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఆ సమస్యకు పరిష్కారం చూపడం కోసమే ఎప్పటిలాగే గ్రెడింగ్ విధానంతో పాటు ఈసారి మార్కులు కూడా వెల్లడిస్తున్నట్టు మంత్రి సురేష్ చెప్పారు. మార్చి 4 నుంచి 23 తేదీ వరకు 20 రోజుల పాటు ఇంటర్మీడియె పరీక్షలు జరుగుతాయని... ఈ పరీక్షల కోసం 1,411 పరీక్ష కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు జరిగిపోతున్నాయని అన్నారు. 10 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే ముందస్తుగా వెలువడిన షెడ్యూల్ ప్రకారమే మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 6 లక్షల 30 వేల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. పదవ తరగతి పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,900 పరీక్షా కేంద్రాలు ద్ధం చేస్తున్నాం. 


పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్:
అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు అవుతుందని.. అలాగే పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రాలు ఉండే ప్రాంతాల్లోని అన్ని జిరాక్స్ కేంద్రాలు కూడా మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇన్విజిలేటర్లు సైతం కాపీయింగ్‌కి సహకరించడానికి వీల్లేకుండా జంబ్లింగ్ విధానంలో వారికి విధులను కేటాయించనున్నట్టు మంత్రి సురేష్ స్పష్టంచేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు కింద కూర్చుని పరీక్ష రాసే అవస్థలు లేకుండా ఇంటర్, పదవ తరగతి పరీక్షలు జరిగే అన్ని పరీక్షా కేంద్రాల్లో తగిన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు మీడియాకు వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..