AP Inter Supplementary: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపు
AP Inter Supplementary: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ఇంటర్ సప్లిమెంటరీ లేదా బెటర్‌మెంట్ రాయాలనుకుంటే ఇదే చివరి అవకాశం. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు గడువు తేదీని ఇవాళ్టికి పొడిగించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Inter Supplementary: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఇంటర్ బోర్డ్ కీలకమైన అప్‌డేట్ జారీ చేసింది. మార్చ్ 1 నుంచి 14 వరకూ జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలయ్యాయి. సప్లిమెంటరీ రాసే విద్యార్ధులకు గడువు నిన్న ఏప్రిల్ 30తో ముగిసింది. అయితే ఆ గడువును ఇవాళ్టికి పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది.
ఏపీలోని వివిధ కళాశాలల అభ్యర్ధన మేరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ లేదా బెటర్ మెంట్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీని ఇవాళ్టికి అంటే మే 1కు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఓ వైపు ఎండలు, మరోవైపు సెలవులు కావడంతో చాలామంది విద్యార్ధులు ఫీజులు చెల్లించలేదు. దాంతో వివిధ కళాశాలల యాజమాన్యాలు గడువు పొడిగించాల్సిందిగా కోరాయి. విద్యార్ధులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లింపును ఇవాళ సాయంత్రం 6 గంటల వరకూ పొడిగించారు. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
ఇంటర్ పరీక్షల్లో రీ వెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు 1300 చెల్లించాలి. అదే రీ కౌంటింగ్ అయితే సబ్జెక్టుకు 260 రూపాయలు ఫీజు చెల్లించాలి. బెటర్‌మెంట్ రాసే ఆర్ట్స్ గ్రూప్ విద్యార్ధులు సబ్జెక్టుకు 1240 రూపాయలు, సైన్స్ అయితే 1440 రూపాయలు కట్టాలి. అదే సప్లిమెంటరీ రాసే విద్యార్ధులకు 1100 రూపాయలు చెల్లించాలి. ప్రాక్టికల్స్‌కు మరో 500 రూపాయలు చెల్లించాలి.
Also read: Jio Cinema: రోజుకు 1 రూపాయితో జియో సినిమా ప్రీమియం సభ్యత్వం, 12 ఓటీటీలతో జియో ప్లాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook