Inter Hall Tickets: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్ధులకు అలర్ట్. మరో రెండ్రోజుల్లో ప్రారంభం కావల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12వ తేదీ వరకూ జరగనున్నాయి. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కావల్సిన పరీక్షలు..జేఈఈ మెయిన్స్ పరీక్ష తేదీల కారణంగా వాయిదా పడ్డాయి. మరో రెండ్రోజుల్లో అంటే మార్చ్ 11 నుంచి ఇంటర్నీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విడుదల చేసింది. ఈ హాల్ టికెట్లను చాలా సులభంగా ఇంట్లోనే కూర్చుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే..


ముందుగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్‌పేజ్‌లో Download Practical Hall Tickets March 2022 పై క్లిక్ చేసిన తరువాత మరో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్‌కు సంబంధించిన రోల్ నెంబర్ లేదా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత Download Hall Ticketపై క్లిక్ చేసి..ప్రింట్ తీసుకుంటే చాలు. ఇంటర్మీడియట్ విద్యార్ధుల రోల్ నెంబర్‌ను కళాశాల నుంచి పొందాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు నెంబర్‌తో కూడా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు జరిగే మెయిన్ పరీక్షల హాల్ టికెట్లు వేరుగా ఉంటాయి. అవి త్వరలో విడుదల కానున్నాయి. ఇవి కూడా ఇదే వెబ్‌సైట్ నుంచి ఇదే పద్ధతిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Also read: AP Assembly Budget Session 2022: అసెంబ్లీలో గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్, రేపు సభకు సెలవు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook