Inter Exams New Patter: ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంటర్ పరీక్షల్లో కొత్త విధానం ప్రకటించింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బోర్డు పరీక్షలు రద్దు చేయడంతో పాటు పరీక్షల మార్కుల్లో కూడా కొత్త పద్ధతి తీసుకొస్తోంది. అయితే ఈ కొత్త విధానం ఎప్పట్నించనే విషయంపై నెలకొన్న సందిగ్దతకు తెరదించింది. పూర్తి వివరాలు మరోసారి ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్మీడియ్ పరీక్షల్లో కొత్త విధానం అమల్లోకి వస్తోంది. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించినట్టుగా కొత్త విధానం ఈ ఏడాది నుంచి కాకుండా వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది. కొత్త విధానం ప్రకారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ఉండవు. ఏ కళాశాలకు ఆ కళాశాల ఇంటర్నల్‌గా నిర్వహించుకుంటాయి. బోర్డుతో సంబంధం ఉండదు. ఇంటర్నల్ పరీక్షలు మాత్రమే ఉంటాయి. రెండో ఏడాది మాత్రం బోర్డు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఈ విధానం ఈ విద్యా సంవత్సరం అంటే 2024-25 లేదా 2025-26 లో ఎప్పట్నించనే విషయంపై సందిగ్దత నెలకొంది. దీనిపై ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఇంటర్ పరీక్షల కొత్త విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నామని తెలిపింది. ఈ సంవత్సరం ఇంటర్ మొదటి ఏడాది పబ్లిక్ పరీక్షలు యధావిధిగా ఉంటాయని వెల్లడించింది.


ఇంటర్ పరీక్షల కొత్త విధానం ఎలా ఉంటుందంటే


అయితే ఇంటర్ మొదటి ఏడాది కళాశాల ఇంటర్నల్ పరీక్షలు విధిగా పాస్ అవాల్సి ఉంటుంది. కానీ మార్కుల ప్రామాణికత ఉండదు. హ్యూమన్ వ్యాల్యూస్ అండ్ ఎథిక్స్, పర్యావరణ పరీక్ష కొనసాగుతుంది. కళాశాల స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ ఉంటాయి. మిగిలినవాటికి 20 ఇంటర్నల్ మార్కులుంటాయి. ఇప్పుడున్న మేథ్స్ ఏ, బీ పేపర్లకు కలిపి 150 మార్కులు కాకుండా రెండూ కలిపి  100 మార్కులకు ఉంటుంది. ఇక బయోలజీ, జువాలజీ కూడా రెండూ కలిపి 100 మార్కులకు ఉంటుంది. పబ్లిక్ పరీక్షల్లో ఒక మార్కు ప్రశ్నలుండవు. 8 మార్కుల ప్రశ్నల స్థానంలో 5 లేదా 6 మార్కుల ప్రశ్నలు కన్పిస్తాయి. కొత్తగా మేథ్స్‌తో బైపీసీ చదివే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ విధానం కేవలం సీబీఎస్ఈలోనే ఉంది. 


మొత్తం 23 సబ్జెక్టులుంటాయి. వీటిలో ఐదు తప్పనిసరి. ఆరోది ఆప్షనల్..అంటే విద్యార్ధి ఎంచుకోవచ్చు. ఐదు సబ్జెక్టుల్లో ఏదైనా ఒక దాంట్లో ఫెయిల్ అయితే ఆరవ అంశం మార్కులు ప్రామాణికమౌతాయి. ఇందులో ఉత్తర్ణులయితే మొత్తం పాస్ అయినట్టే. సెకండ్ ఇయర్ మార్కుల మెమోలో ఐదు సబ్జెక్టులకు కలిపి 500 మార్కులుంటాయి ఆరో అంశం మార్కులు విడిగా చూపిస్తారు. ఈ కొత్త విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు కానుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 


Also read: TTD War: చంద్రబాబు సాక్షిగా టీటీడీ ఛైర్మన్ వర్సెస్ ఈవో ఘర్షణ, నువ్వెంతంటే నువ్వెంత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.