Parthasarathy meets Chandrababu: ఏపీలో ఎన్నికలు సమీపించేకొద్దీ భారీగా సమీకరణాలు మారుతున్నాయి. మార్పులు, చేర్పులతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైఎస్ జగన్ భారీగా చేపడుతున్న ఎమ్మెల్యేల మార్పులు, ప్రక్షాళనతో, ఇతర కారణాలతో అసంతృప్తులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఓ ఎమ్మెల్యే అవుట్ కాగా మరో ఎమ్మెల్యే అదే బాటలో ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కృష్ణా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు గట్టి షాక్ తగలనుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నమ్మకస్థుడిగా ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే , మాజీ మంత్రి పార్ధసారధి పార్టీ వీడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే ఆయన హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలవడం హాట్ టాపిక్‌గా మారింది. అన్నీ కుదిరితే 1-2 రోజుల్లోనే పసుపు కండువా కప్పుకోవచ్చని తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ వెంటే నిలిచిన పార్ధసారథి ఇప్పుడు ఎన్నికల ముందు వైదొలగడానికి కారణం గత కొద్దికాలంగా ఆయనలో ఉన్న అసంతృప్తేనని తెలుస్తోంది. 


విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కూడా ఆయన తన స్థలంలోనే ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించారు. పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. బీసీ సామాజికవర్గంలో కూడా మంచి పేరున్న నేత. అన్నింటికంటే ముఖ్యంగా వివాద రహితుడనే పేరుంది. రెండుసార్లు మంత్రి పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. గత కొద్దికాలంగా ముఖ్యమంత్రి జగన్‌ను నేరుగా కలిసే అవకాశం కూడా లభించడం లేదనే వాదన విన్పిస్తోంది. తన తరువాత పార్టీలో వచ్చినవారికి కీలక పదవులిచ్చి తనను పక్కన పెట్టేశారనే ఫీలింగ్ పార్ధసారథిలో ఎక్కువగా కన్పిస్తోంది. 


ఇటీవల జరిగిన సామాజిక బస్సు యాత్రలో సైతం అందరి సమక్షంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాననడం, సీఎ జగన్ తనను గుర్తించడం లేదని చెప్పడం అందరికీ తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వ్యాఖ్యలు పార్ధసార్ధిని మరింత కృంగదీశాయి. పదవులు, సీట్ల కోసం ఆశపడేవాళ్లు పార్టీని వీడితే మంచిదని గుడివాడ వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపధ్యంలో పార్దసారధి మార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబుతో భేటీ అయ్యారని సమాచారం. 


అటు చంద్రబాబు సైతం బీసీల్లో మంచి పేరున్న పార్ధసారథి వంటి నేతల్ని చేర్చుకోవడం ద్వారా చేజారిన బీసీ ఓటు బ్యాంకును సమీకరించవచ్చనే ఆలోచనలో ఉన్నారు.


Also read: Jagan vs Revanth: జగన్ నాకు కనీసం ఫోన్ చేయలేదంటున్న రేవంత్ రెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook