AP LAWCET Results: ఆంధ్రప్రదేశ్ లాసెట్ పరీక్ష ఫలితాలు(AP LAWCET Results) గురువారం విడదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. న్యాయ కళాశాలల్లో మూడు, ఐదేళ్ల న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. మూడేళ్ల లా కోర్సులో 92.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐదేళ్ల లా కోర్సు(Five Years Law Course)లో 1,991(76.84) మంది ఉత్తీర్ణులయ్యారని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read:Police Commemoration Day 2021: ఏపీ పోలీసులకు గుడ్‌ న్యూస్ చెప్పిన సీఎం జగన్‌


మూడేళ్ల లా కోర్సు(Three Years Law Course)లో విజయవాడకు చెందిన మోపురు హరిప్రియ మొదటి ర్యాంకు సాధించారు. గుంటూరుకు చెందిన లీలా రాజా సెకండ్‌ ర్యాంక్‌.. కందలగడ్డ హరికృష్ణ మూడో ర్యాంకు సాధించారు. చీరాలకు చెందిన గొర్ల హారిబాబు,  అనంతపురానికి చెందిన సాతర్ల మంజునాధ 4, 5 ర్యాంకులు సాధించారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఏపీ లాసెట్ నిర్వహణలో సైతం జాప్యం జరిగింది. గత ఏడాది నిర్వహించిన లాసెట్ 2021 ఫలితాలు నేడు విడుదలయ్యాయి. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఏపీ లాసెట్ ఫలితాలను తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.


ఐదేళ్ల లా కోర్సుల్లో
*మొదటి ర్యాంక్- మోనికా భాయి, బనగానపల్లె, కర్నూల్ జిల్లా.
*సెకండ్ ర్యాంక్- వెలిచేటి నాగ సాయి ప్రశాంతి,  బంటుపల్లి, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా
*మూడో ర్యాంక్- ఇనపకుర్తి శ్రీనివాస సునీల్, బూడి వీధి పూసపాటి రేగడ, విజయనగరం జిల్లా


పీజీ లాసెట్‌లో
*మొదటి ర్యాంక్‌- యారబాల గీతిక, శివాజిపాలెం, విశాఖపట్నం
*సెకండ్ ర్యాంక్.- కాగడాల కృష్ణం నాయుడు, శ్రీకాకుళంజిల్లా..
*మూడో ర్యాంక్, రరమేష్ బాబు తాత పూడి,  విజయవాడ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి