AP Liquor Tenders: కొత్త మద్యం విధానం అమలులో భాగంగా కొత్త దుకాణాల కేటాయింపు జరుగుతున్న వేళ ఏపీలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మద్యం దుకాణాలన్నీ తాము దక్కించుకునేందుకు కొందరు సిండికేట్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే లాటరీలో టెండర్‌ దక్కించుకోని వారు నానా హంగామా చేసినట్లు తెలుస్తోంది. ఏపీలోని కొన్ని చోట్ల లాటరీ ప్రక్రియ వివాదానికి దారి తీసింది. లాటరీ పొందిన వారితో బేరసారాలకు దిగారని.. లాటరీ ఇవ్వని వారిని కిడ్నాప్‌లకు కూడా యత్నించారు. ఈ పరిణామాలతో మద్యం దుకాణాల కేటాయింపు వివాదానికి దారి తీసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుట్టపర్తిలో కిడ్నాప్‌
శ్రీ సత్య సాయి జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి పుట్టపర్తిలో లాటరీ ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని 87 దుకాణాలకు 1,518 దరఖాస్తులు రాగా కలెక్టర్ చేతన్ నేతృత్వంలో లాటరీ ప్రక్రియ జరిగింది. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 300 మంది పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పుట్టపర్తిలో నిర్వహించిన లాటరీలో ఆశవహులకు అవకాశం లభించగా.. టెండర్‌ దక్కించుకోని వారు నిరాశకు గురయ్యారు. అయితే ఒక చోట టెండర్‌ దక్కకపోవడంతో కొందరు లాటరీ పొందిన వ్యక్తిని కిడ్నాప్‌ చేసిన ఘటన కలకలం రేపింది. లేపాక్షికి సంబంధించి 57వ నంబర్ దుకాణం దక్కించుకున్న రంగనాథ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.


లాటరీలో పుట్టపర్తి సాయి ఆరామంలో మద్యం దుకాణాన్ని రంగనాథ్ దక్కించుకున్నారు. లాటరీ దక్కిన ఆనందంలో స్వగ్రామం లేపాక్షికి బయల్దేరారు. అయితే మార్గమధ్యలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని వెంబడించి అడ్డు తగిలారు. అనంతరం అతడిని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. కిడ్నాప్‌ అయ్యారనే విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు భయాందోళన చెందారు. వెంటనే పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మద్యం షాపు దక్కించుకున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే కొందరు పలుకుబడి ఉన్న వారే అతడిని కిడ్నాప్‌ చేసి ఉంటారని తెలుస్తోంది.


దుకాణాల కేటాయింపు
రాష్ట్రవ్యాప్తంగా దుకాణాల కేటాయింపు కొన్ని చోట్ల మినహా అంతటా ప్రశాంతంగా సాగింది. మద్యం దుకాణాల టెండర్లకు గడువు ముగిసే సమయానికి మొత్తం 90 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. దరఖాస్తుల ద్వారా ప్రభత్వానికి రూ.2 వేల కోట్ల ఆదాయం వచ్చిందని సమాచారం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి