AP DSC 2024 Notification: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తేదీ ఖరారు, ఎప్పుడంటే
AP DSC 2024 Notification: నిరుద్యోగులకు శుభవార్త, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్పష్టత వచ్చేసింది. కూటమి ప్రభుత్వం తొలి హామీగా నిలిచిన మెగా డీఎస్సీ కోసం వేలాది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP DSC 2024 Notification: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తొలి సంతకం చేసిన మెగా డీఎస్పీ కోసం వేలాది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని నిరీక్షిస్తున్నారు. అయితే ఇప్పటికి క్లారిటీ వచ్చింది. నవంబర్ నెల మొదటివారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ తేదీ ఖరారు కావడంతో మిగిలిన ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఎక్కువ మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మెగా డీఎస్సీ కంటే ముందు టెట్ పరీక్షను నిర్వహించింది. ఈ ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. ఆ తరువాత మెగా డీఎస్సీ నోటిపికేషన్ వెలువడనుంది. టెట్ పరీక్ష ఫలితాలు నవంబర్ 2న ప్రకటిస్తారు. డిసెంబర్ నెలలో టీచర్ల నియామకం పూర్తి చేయనున్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను నవంబర్ 3వ తేదీన విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు.
మెగా డీఎస్సీలో ఏ విధమైన న్యాయ వివాదాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని ఇప్పటికే మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. డీఎస్సీ 2024 సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం తెలిపింది. సిలబస్ మారిందనే ప్రచారాన్ని నమ్మవద్దని స్పష్టం చేసింది. సిలబస్ వివరాలు ఇప్పటికే https://aptet.apcfss.in లో సిద్ధంగా ఉన్నాయి. మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాల్లో పలు విభాగాల్లో తక్కువ పోస్టులు ఎందుకున్నాయో ప్రభుత్వం వివరించింది. పదోన్నతులకు సంబంధించి కొంతమంది కోర్టుకు వెళ్లడం వల్ల ఇలా జరిగిందని అధికారులు తెలిపారు.
మెగా డీఎస్సీ పోస్టుల వివరాలు
నవంబర్ 3న జారీ కానున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371, స్కూల్ అసిస్టెంట్లు 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్లు 1781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, పీఈటీలు 132 ఉన్నాయి. గత ప్రభుత్వం 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా ఉందులో 2280 సకెండరీ గ్రేడ్ టీచర్లు, 2299 స్కూల్ అసిస్టెంట్లు, 1264 మంది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 215 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ముందు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో మొత్తం డీఎస్సీ నోటిఫికేషన్ రద్దయింది.
Also read: Railway Zone: ఏపీకి కేంద్రం దసరా కానుక.. రైల్వే జోన్, భోగాపురం ఎయిర్ పోర్ట్ సహా పలు వరాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.