AP Mining Files Burnt: ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి కలకలం రేగింది. ప్రభుత్వ పత్రాలుగా భావిస్తున్న ఫైల్స్‌, హార్డ్‌ డిస్క్‌, క్యాసెట్‌లు వంటివి గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఇది గమనించిన స్థానికులు కేకలు వేయగా ఆ వ్యక్తులు కారులో పరారవడం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. ఆ ఫైల్సన్నీ గత ప్రభుత్వం కీలక మంత్రిగా పని చేసిన వ్యక్తికి సంబంధించినవని తెలుస్తోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Jagan Sharmila: ఒకే వేదికపై వైఎస్‌ జగన్, షర్మిల.. ఆరోజు ఏం జరగబోతున్నది?


 


కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని యలమలకుదురు కరకట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి 10 గంటల సమయంలో కొందరు వ్యక్తులు కారుల్లో వచ్చారు. మైనింగ్ శాఖకు (గనులు) ‌చెందిన అనేక‌ పత్రాలు, హార్డ్ డిస్క్, క్యాసెట్‌లు దగ్ధం చేస్తున్నారు. అక్కడి స్థానికులు వారిని నిలదీశారు. ఏం చేస్తున్నారని ప్రశ్నించగా దగ్ధం చేస్తున్న వ్యక్తులు ఒక్కసారిగా అక్కడి నుంచి కారులలో ఉడాయించారు. 

Also Read: YS Jagan Case: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు భారీ ఎదురుదెబ్బ.. త్వరలోనే జైలుకు?


 


యనమలకుదురు ‌కట్ట మీద రోడ్డు వెంట రికార్డులు తగులపెట్టింది ప్రభుత్వ సిబ్బందిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరులుగా కూడా అనుమానిస్తున్నారు. కారులో పెద్దఎత్తున తెచ్చి దస్త్రాలు కాల్చిన ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కృష్ణా నది ఇసుక తిన్నెల వద్ద కారు ఆపి ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలు దహనం చేశారని ఎమ్మెల్యే పోలీసులకు చెప్పారు. 


గత ప్రభుత్వంలో చేసిన అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయనే భయంతోనే ఇలా ఫైల్స్‌ దగ్ధం చేసి ఉంటారని ఎమ్మెల్యే ప్రసాద్‌ తెలిపారు. అధికారులు ఉన్నత స్థాయి విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా పత్రాల దహనం వ్యవహారంపై గురువారం ప్రభుత్వం ఆరా తీయనుంది. దగ్ధం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అసలు గనుల శాఖలో ఏం జరిగిందో పూర్తిస్థాయి విచారణకు కూడా ఆదేశించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై విచారణ చేపట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన నిర్వహించిన శాఖకు సంబంధించి పత్రాలు దగ్ధం చేయడంపై తీవ్రంగా పరిగణించనుంది. తక్షణమే గనుల శాఖపై విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించే అవకాశాలు ఉన్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి