ఏపీ ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు, అనంతపురం జడ్పీ చైర్మన్ పూల నాగరాజు తృటిలో ఓ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం కాలువపల్లి తండా వద్ద శుక్రవారం వీళ్లిద్దరూ కలిసి ప్రయాణిస్తున్న వాహనం ఓ అనుకోని ప్రమాదం బారిన పడింది. టీడీపీ సీనియర్‌ నేత బాదన్న వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి అనంతపురం జిల్లా కేంద్రం నుంచి కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి వెళ్తున్న క్రమంలో.. ఎదురుగా వస్తున్న మరో కారు వెనుక టైరు పంక్చరై అదుపుతప్పి మంత్రి కారుని ఢీకొంది. ఈ ప్రమాదంలో మంత్రి ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా దెబ్బతినగా మంత్రి, జడ్పీ చైర్మన్‌‌తోపాటు వారి కారు డ్రైవర్ సైతం సురక్షితంగా బయటపడ్డారని అనంత పోలీసులు తెలిపారు.


ప్రమాదం అనంతరం కాన్వాయ్‌లోని మరో కారులో మంత్రి కాల్వ శ్రీనివాసులు, జడ్పీ చైర్మన్ పూల నాగరాజు కళ్యాణదుర్గం వైపు ముందుకు సాగిపోయారు.