RK Roja: డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడ కొట్టినట్టుంది లోకేష్ పాదయాత్ర!
AP Minister RK Roja Slams Pawan Kalyan: ఏపీ మంత్రి ఆర్కే రోజా నారా లోకేష్ పాదయాత్ర మీద విరుచుకుపడ్డారు, అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబులు కూడా టార్గెట్ చేస్తూ రచ్చ చేశారు. ఆ వివరాలు
AP Minister RK Roja Slams Pawan Kalyan, Chandrababu and Lokesh: ఏపీ ప్రతిపక్ష నేత కుమారుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ నుంచి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించనుండగా ఈ పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టారు.
400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగేలా లోకేష్ రూట్ మ్యాప్ సిద్దం చేసుకుంటున్నారు. జనవరి 27వ తేదీన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇక మంత్రి రోజా ఈ అంశం మీద నారా లోకేష్ మీద పాదయాత్ర మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. యువగళం... నారా గరళమా? నారా లోకేష్ దొంగ దారిలో మంత్రి అయ్యాడు, ఇప్పుడు పాదయాత్ర చేసి ఏమి సాధిస్తాడు? అని ప్రశ్నించారు.
కరోనా టైంలో హైదరాబాద్ లో తండ్రి కొడుకులు దాక్కున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇచ్చారని పేర్కొన్న రోజా బాదుడే బాదుడు, ఇదేం ఖర్మరా కార్యక్రమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని అన్నారు. ఇక ఇప్పుడు ఏమి చేశామని చెప్పుకుని తిరుగుతాడు పాదయాత్రలో అని ఆమె ప్రశ్నించారు. డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడ కొట్టడం లోకేష్ పాదయాత్ర రెండు ఒకటేనని విమర్శించారు రోజా.
ఇక పవన్ కళ్యాణ్ గురించి ఆమె మాట్లాడుతూ ఎప్పుడూ ఏ షో కి వెళ్ళని పవన్ కళ్యాణ్ బాలయ్య షోకి ఎందుకు వెళ్ళాడు? అని ప్రశ్నించారు. బాలకృష్ణ పవన్ అభిమానులను ఎంతో దారుణంగా తిట్టారు కదా అయినా ఎందుకు వెళ్లారని ఆమె ప్రశ్నించారు. షో వల్ల పవన్ కల్యాణ్ కి ప్యాకేజ్ వస్తుంది, ఆయన అభిమానులకు తిట్లు వస్తాయని పేర్కొన్న ఆయన పవన్ కల్యాణ్ ను చూస్తే వోడాఫోన్ యాడ్ గుర్తుకు వస్తుంది, చంద్రబాబు ఎక్కడ ఉంటే పవన్ అక్కడ ఉంటాడని ఆమె అన్నారు. పెన్షన్ రద్దు అంటూ ప్రతిపక్షాలు కోడి గుడ్డు మీదా ఈకలు పీకుతున్నారు కానీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ వస్తుందని ఆమె అన్నారు.
Also Read: Chandrababu Meeting: బాబు సభలో అపశ్రుతి.. ఏడుగురు మృతి..8 మందికి తీవ్ర అస్వస్థత!
Also Read: Nandamuri Balakrishna-Ram Charan : సంక్రాంతికి ముందు నా సినిమా చూడు.. రామ్ చరణ్‌ను బెదిరించిన బాలయ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook