వెనుకబడిన తరగతుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ జనగణన చేయాలనే దీర్ఘకాలిక డిమాండ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో బీసీల జనగణన(BC Census) అనేది చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశం. ఇప్పటికే దేశంలో 1931 జనాభా లెక్కల ప్రకారమే బీసీలను లెక్కిస్తున్నారు. కులాల వారీగా జనగణన చేపట్టాలని మంత్రి వేణుగోపాల కృష్ణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. వెనుకబడిన కులాల జనగణన అత్యవసరమని..నిజమైన నిరుపేదలకు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. సంక్షేమ పధకాల అమలుకు ఇది చాలా అవసరమన్నారు. 


దేశంలో గత 90 ఏళ్లుగా బీసీల లెక్కలు అందుబాటులో లేవని మంత్రి చెప్పారు. వెనుకబడిన తరగతుల జీవన స్థితుల్ని తెలుసుకోవల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలోని బీసీల్లో 139 కులాలున్నాయన్నారు. కులగణన కచ్చితంగా చేయాల్సిందేనన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) తీసుకుంటున్న పలు నిర్ణయాలతో బీసీలకు చాలా మేలు కలుగుతుందని..బీసీల్లో చైతన్యం వస్తుందని మంత్రి వేణు గోపాలకృష్ణ(Venu Gopalakrishna) చెప్పారు. ఇది పూర్తిగా బీసీల ప్రభుత్వమని..నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం, కాంట్రాక్టు పనుల్లో 50 శాతం కల్పిస్తున్నామన్నారు. అదే గత ప్రభుత్వమైతే బీసీల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించిందన్నారు. ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఓ వరంగా మారిందన్నారు. మరోవైపు వైఎస్సార్ చేయూత పధకం చాలామందికి చాలా రకాలుగా దోహదపడుతోందన్నారు. 


Also read: మీ పతనం చూడాలనే.. చంద్రబాబుపై ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook