AP MLC Elections: ఆంధ్రప్రదేశ్ లో నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు.. మెుదలైన పోలింగ్
AP MLC Elections 2023: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అటు వైసీపీ ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలూ ఈ ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
AP MLC Elections 2023: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మెుదలైంది. ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల కోసం బ్యాలెట్లను వాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3 పట్టభద్ర, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 5 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే.
ఉత్తరాంధ్ర పట్టుభద్ర ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 37 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరోవైపు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు బరిలో 22 మంది అభ్యర్థులు, కడప-అనంతపురం బరిలో 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 12 మంది నిలిచారు. 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ వెంటనే ఫలితాలు విడుదల చేస్తారు.
ఈ ఎన్నికల్లో మెుత్తంగా 2.87 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆరు జిల్లాల పరిధిలో 331 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,482 మంది పోలీసు సిబ్బందితో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పోలింగ్ స్టేషన్ ల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా కోరారు.
Also Read: Pawan Kalyan Comments: టీడీపీతో జనసేన డీల్.. 20 సీట్లలోనే పోటీ.. పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి