Ap Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలు ముగిశాయి. నాలుగో విడతలో కూడా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హవా కనబర్చింది. కొన్నిచోట్ల తెలుగుదేశంతో పోటీ ఉన్నప్పటికీ..మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకూ వైసీపీ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్కంఠ రేపిన ఏపీ పంచాయితీ ఎన్నికలు( Ap panchayat elections ) ముగిశాయి. నాలుగు దశల్లో జరిగిన ఎన్నికల్లో చివరి దశ ఇవాళ ముగిసింది. తొలి మూడు దశల్లో కనబర్చినట్టే అధికారపార్టీ నాలుగోదశలోనూ ఆధిక్యం కనబర్చింది. నాలుగో విడతలో మొత్తం 82.85 శాతం పోలింగ్ నమోదు కాగా..నాలుగు దశల్లోనూ కలిపి 81.78 శాతం నమోదైంది. నాలుగవ దశలో 2 వేల 743 పంచాయితీలు,  22 వేల 423 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. నాలుగో విడతలో 3 వేల 299 పంచాయితీలకు నోటిఫికేషన్ వెలువడగా..554 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పటివరకూ అందిన ఫలితాల ప్రకారం వైసీపీ ( Ysr congress party )బలపర్చిన అభ్యర్ధులు 1163 మంది విజయం సాధించగా..టీడీపీ  ( Telugu desam ) మద్దతుదారులు 83  స్థానాల్లో విజయం సాధించారు.  బీజేపీ మద్దతుదారులు 10 స్థానాల్లో ఇతరులు 8 స్థానాల్లో గెలిచారు. 


రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీ ఎన్నికల్లో 2.26 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పంచాయితీ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ ( Girija Sankar ) తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని..అందరూ సమర్ధవంతంగా పనిచేశారని కితాబిచ్చారు. మొత్తం నాలుగు దశల పంచాయితీ ఎన్నికల్లో 2 వేల 197 పంచాయితీలు, 47 వేల 459 వార్డులు ఏకగ్రీవమైనట్టు తెలిపారు. నాలుగు దశల్లో కలిపి 10 వేల 890 పంచాయితీలు, 82 వేల 894 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరో పది పంచాయితీలు, 670 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదన్నారు. వీటిపై ఎస్ఈసీకు నివేదించి చర్యలు తీసుకోనున్నారు. 


Also read: Polavaram Dam works: పోలవరం పనులు శరవేగంగా..కొలిక్కి వచ్చిన పెండింగ్ డిజైన్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook