తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో టీడీపీకు గుడ్ బై చెప్పి..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా అంటే మెజార్టీ అవుననే సమాధానం విన్పిస్తోంది. గంటా చేరికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టేనా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019 సాధారణ ఎన్నికల్లో ఏపీలో 151 సీట్లు సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఆ సమయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కేవలం 23 సీట్లకు పరిమితమైంది. ఈ 23మందిలో ఒకడు విశాఖపట్నం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావు విషయం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమౌతోంది. త్వరలో ఆయన టీడీపీకు గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం భారీగా జరుగుతోంది. అంతేకాదు..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారని ప్రచారం విస్తృతంగా సాగుతోంది. 


అయితే గంటా పార్టీ మారనున్నారని గతంలోనే వైసీపీ నేత విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. అయితే గంటా శ్రీనివాసరావు పార్టీ మారకపోయినా..టీడీపీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉన్నారు. అటు మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ ఆందోళన చేస్తున్నా..గంటా శ్రీనివాసరావు మౌనమే వహించారు. ఇప్పుడు మాత్రం కచ్చితంగా వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని తెలుస్తోంది.


ఇప్పటికే ఈ విషయమై బంధువులతో చర్చించినట్టు సమాచారం. కొన్నిరోజుల క్రితం చిరంజీవిని కూడా కలిశారు. గంటా వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు అంతా సిద్ధమైందని సమాచారం. డిసెంబర్ 1న ఆయన జన్మదినం తరువాత వైసీపీ తీర్ధం పుచ్చుకోవచ్చని తెలుస్తోంది. డిసెంబర్ మొదటివారంలో విశాఖపట్నంలో వైఎస్ జగన్ సభ ఉంది. గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పు ఆ సభ సాక్షిగా జరగవచ్చనే ప్రచారం సాగుతోంది.


Also read: APSRTC: సంక్రాంతికి ఊరెళుతున్నారా..? ప్రయాణికులకు గుడ్ న్యూస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook