AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా వాయవ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది రాబోయే 48 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ, వాయవ్య దిశగా కదిలే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ, విపత్తుల సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పలుచోట్ల రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 


మంగళవారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. తీరం వెంట పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని..పెను గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరంలో ఉన్న ఆవర్తనం వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారింది. రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండనుంది. ఇప్పటికే పలు చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. 


అల్పపీడనం ప్రభావం తెలంగాణ, ఒడిశాపై అధికంగా ఉండనుంది. తెలంగాణలోనూ రాగల మూడురోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈనేపథ్యంలో పలు జిల్లాల్లో ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, వరంగల్, హన్మకొడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తమయ్యారు.





Also read:INDW vs AUSW: కామన్వెల్త్ గేమ్స్‌ క్రికెట్‌లో మన అమ్మాయిలకు స్వర్ణం దక్కేనా..? రేపే తుది పోరు..!


Also read:Minister Harish Rao: తెలంగాణపై వివక్ష దేనికీ..కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు ధ్వజం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook