AP Rain Forecast: ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!
AP Rain Forecast: ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్షసూచన! రానున్న రెండు మూడు రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
AP Rain Forecast: రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గతేడాది సంభవించిన వరదల కారణంగా కడప, కర్నూల్, అనంతపురం, చిత్తూరు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఆయా జిల్లాల అధికారులను ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల రానున్న 48 గంటల్లో అది మరింత బలపడే అవకాశం ఉందని గురువారం వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
బంగాళఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ALso Read: Weather Alert: ఆ ప్రాంతాల్లో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
Also Read: TTD Hundi Income: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook